నిడదవోలు నియోజకవర్గం లోని ఉండ్రాజవరం మండలంలో చిలకపాడు గ్రామంలో రంజాన్ సందర్భంగా జనసెన పార్టీ తరఫున గొడే రమేశ్ గారి అధ్వర్యంలో ముస్లిం సోదర సోదరీ మణులకు( 30 కుటుంబాలకు )రంజాన్ తోఫా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసెన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ మతి ప్రియా సౌజన్య గారు మాట్లాడుతూ
నెల రోజుల పాటు ఎంతో నిష్టతో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదర, సోదరీమణులకు ముందుస్తుగా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు అందజేస్తూ,ఆ అల్లా చల్లని దీవెనలతో అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు..ఈ సందర్భంగా జనసెన పార్టీ మండల అధ్యక్షులు వీరమళ్ళ బాలాజీ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా, అధికారంతో పని లేకుండా చిలకపాడు గ్రామంలో ప్రజల ప్రతి కష్టానికి మేమున్నాం అంటూ జనసైనీకులు తమకు తోచినంతలో సహాయము చేస్తున్నారన్నారు..
ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి సాదా వెంకట్ గారు, పందలపర్రు జనసెన నాయకులు ANR గారు, కర్రి వినోద్ కుమార్ గారు, మరియు గరిమెళ్ళ కొండలరావు గారు, ఇంటి వెంకట్,, కైగాల ప్రసాద్, హనుమంతు పండు, ఇర్రి మోహనకృష్ణ,నిమ్మకాయల మణికంఠ,మరియు చిలకపాడు జనసైనికులు భగవాన్ , సురేష్ చిమ్మా ,కార్తీక్ చండిక ,తేజ చెల్లింకి,మణికంఠ ,పవన్ అడ్డా,లాలి భాష sk పాల్గోన్నారు..
రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్తున్నప్పుడు sk మస్తాన్ గారికి ఇరవై రోజుల క్రితం ప్రమాదవసాత్తూ మోచెయ్యి ఫ్రాక్చర్ అయిన విషయం తెలుసుకుని అప్పటికప్పుడు జనసేన పార్టీ తరఫున 2000 రూపాయలు ఆర్ధిక సహాయం చేసి. వాళ్లకి పార్టీ తరఫున ఎటువంటి సహాయం కావాలన్నా చెయ్యటానికి సిద్ధం అని హామీ ఇవ్వడం జరిగింది..