ఏపీలోని అనకాపల్లికి చెందిన ‘పుష్ప’ అనే అమ్మాయి చేసిన పని చూశాక ఇప్పటికైనా సంబంధాలు కలుపుకునే తల్లిదండ్రులు.. తమ పిల్లలకు అసలు ఈ సంబంధం ఇష్టమేనా? అని ఒక్కసారి గట్టిగా అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పెళ్లి చేసుకునే వారి మనసులు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం.
పెద్దింటి సంబంధాలు, అమెరికా సంబంధాలంటూ అంటగట్టేస్తుంటారు. పెళ్లికి ఇష్టం లేక ఏకంగా వరుడి అనకాపల్లిలో పుష్ప అనే అమ్మాయికి రామానాయుడు అనే అబ్బాయితో పెళ్లి నిశ్చయం అయ్యింది. మే 20న పెళ్లి. కానీ అమ్మాయికి ఆ పెళ్లి ఇష్టం లేదు. దాంతో అబ్బాయి ప్రాణం తీస్తే ఈ పెళ్లి బాధ తప్పుతుందని వెర్రి ఆలోచన చేసింది. అబ్బాయిని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని కళ్లకు తన చున్నీ కట్టి వెంట తెచ్చుకున్న కత్తితో అతడి గొంతు కోసింది. కానీ టైం బాగుండి ఆ అబ్బాయి బతికాడు..
అమ్మాయికి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువని.. పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదని పోలీసులు విచారణలో తేల్చారు. ఈ విషయాన్ని కన్న తల్లిదండ్రులు కూడా తెలుసుకోకపోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. గొంతు కోసిన పాపానిని ఇప్పుడు అమ్మాయి పుష్ప జైలు పాలు కాగా.. అబ్బాయి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
పెళ్లి అంటే పుష్పకు అస్సలు ఇష్టం లేదని పోలీసుల విచారణలో తేలింది. పెళ్లిని తప్పించాలనుకుంది. ఇంట్లో చెబితే ఏమనుకుంటారో అని భయపడింది. నిశ్చితార్థం జరిగి పెళ్లి తేదీ దగ్గరపడే కొద్దీ ఆందోళన మొదలైంది. హైదరాబాద్ నుంచి వచ్చిన వరుడిని పిలిచి సర్ ప్రైజ్ పేరుతో గొంతు కోసింది.
రామానాయుడు కాస్త తేరుకున్నాడు కాబట్టి ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ఆ కత్తి ఇంకా గొంతులోకి దిగి ప్రాణాలు పోయేంతగా కోయలేదు పుష్ప. అందుకే వరుడి ప్రాణాలు నిలిచాయి.
పుష్పకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలని మనసులో బలంగా ఆలోచన ఉంది. కానీ దానిని బయటకు చెప్పకుండా ఇంతటి ఘాతుకానికి పాల్పడింది. మనసులో ఏదో పెట్టుకొని వరుడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఈ నేరానికి ఇప్పుడు జైలు పాలైంది.
ఈ పోటీ ప్రపంచంలో ఎవరూ మన కష్టాలు వినేలా లేరు. సో పంచుకోవడానికి మిత్రుల కొరత బాగా ఉంది. ఇలా ఆత్మనూన్యతతో పుష్పలా బాధపడేవారు చాలా మందే ఉన్నారు.
అదే ఇలాంటి విషయాల్లో ప్రధానం. లేదంటే ఇలా ఇష్టం లేని పెళ్లిపై వాళ్లకు వాళ్లు ప్రాణాలు తీసుకోవడమో.. లేదంటే ఇలా తెగించి వరుడి ప్రాణాలు తీయడమో చేస్తారు. అమ్మాయిలు కూడా పెళ్లిపై కుండబద్దలు కొట్టినట్టు మనసు విప్పి చెప్పాలి. అప్పుడే ఇలాంటి ఉపద్రవాలు తప్పుతాయి.
గొంతు కోసం అమ్మాయి ఉదంతం బయటకు వచ్చాక అందరూ ఇప్పటికైనా జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.