భగ భగ మండుతున్న హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది.


హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.
ఉదయం నుంచి మధ్యాహ్నం 4గంటల వరకు భగ భగ మండిన భానుడు ఆ తర్వాత ఒక్కసారిగా కూల్ అయ్యాడు. దీంతో నగరంలోని పలు చోట్ల చిరు జల్లు పడ్డాయి. మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షం కురిసింది. మాదాపూర్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, నాంపల్లి, ఎల్బీనగర్, హయత్ నగర్, సికింద్రాబాద్, ఉప్పల్, నాగోల్ వర్షం కురిసింది.

శామీర్ పేటలో వడగళ్ల వాన పడింది. మలక్ పేటలో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో అప్పటివరకు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన నగరవాసులు వర్షం కురవడం ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం పొందారు. కాగా గత రెండు రోజులుగా హైదరాబాద్ లో మరింత మండుతున్నాయి.మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వేసవిలో భానుడు భగభగ మండిపోతున్నాడు. సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. ఎండల తీవ్రత కారణంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఓవైపు తీవ్ర ఉక్కపోత, మరోవైపు వడదెబ్బ.. దీంతో జనాలు విలవిలలాడిపోతున్నారు.

ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. తెలంగాణలో రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. ఎండలతో కేర్ ఫుల్ గా ఉండాలని సూచించింది. వడదెబ్బ బారిన పడకుండా, డీహైడ్రేషన్ అవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.