ఈనెల 12 నుంచి ఏపీలో పవన్ కళ్యాణ్ యాత్ర


వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లల్లో
1,857 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. తొలి ఏడాది 1019 మంది, రెండో ఏడాది 838 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.  

రాష్ట్రంలో ఆత్మహత్యలు పవన్ తన పరామర్శ యాత్ర ద్వారా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు రూ. లక్ష ఆర్ధిక సాయాన్ని జనసేన తరపున అందిస్తారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. 

సీఎం జగన్ మళ్లీ పాదయాత్ర చేస్తే ప్రతి రైతు నిరసన తెలుపుతారని.. రైతులందరూ జగన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. రైతు భరోసా పేరుతో వైసీపీ ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రైతులు చితికిపోయారన్నారు. కౌలు రైతులు అయితే నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.చేసుకున్న కౌలురైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. అనంతపురం నుంచి పవన్ తన యాత్రను ప్రారంభించనున్నారు