రాబోయే చిత్రాల డైరెక్టర్స్ తో కలిసి ‘భీమ్లా నాయక్


పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలతో మరో పక్క రాజకీయాలతో బిజీబిజీగా ఉన్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి. పవన్ తర్వాతి సినిమాలు కూడా వరుసగా లైన్ లో ఉన్నాయి. ఇటీవల తన రాబోయే చిత్రాల డైరెక్టర్స్ హరీష్ శంకర్, క్రిష్ తో కలిసి ‘భీమ్లా నాయక్’ సెట్ లో ఫొటో దిగారు.

ఆ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.తాజాగా పవన్ కళ్యాణ్ తన సినిమాల డైరెక్టర్స్ తో దిగిన ఫొటో మరింత వైరల్ అవుతుంది. ఇటీవల ‘భీమ్లా నాయక్’ స్పెషల్ షో వేయగా చూడటానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ని డైరెక్టర్స్ అంతా కలిశారు. ఇందులో పవన్ తనతో ‘వకీల్ సాబ్’ చేసిన వేణు శ్రీరామ్, త్రివిక్రమ్, ‘భీమ్లా నాయక్’ డైరెక్టర్ సాగర్ కే చంద్ర, హరీష్ శంకర్, క్రిష్ ఉన్నారు. ఇలా ఒకే ఫ్రేమ్ లో అయిదుగురు డైరెక్టర్స్ తో ఫొటో దిగడంతో ఇది మరింత వైరల్ అవుతుంది.