భారీ ఆయుధాలు, యుద్ధ ట్యాంకులతో రష్యా బలగాలు యుక్రెయిన్ నగరాల్లోకి దూసుకొస్తున్నాయి. ఆ యుద్ధ ట్యాంకులను అడ్డుకోవటానికి యుక్రెయిన్ పౌరులు శతవిధాల యత్నిస్తున్నారు. ‘శక్తి మేరకు ఎదిరించు కాకపోతే..చాకచక్యంగా అయినా శతృవుని బోల్తా కొట్టించు’అనే విషయాన్ని గుర్తు చేసుకున్నాడో ఏమో గానీ యుక్రెయిన్ శతృదేశం రష్యాకు చెందిన ఓ యుద్ధ ట్యాంకునే ఎత్తుకెళ్లిపోయాడు.
దీంతో ఓ రష్యన్ యుద్ధట్యాంకును తీసుకుపోతుంటే లబోదిబోమంటూ వెనకాల పరిగెడతున్నట్లుగా ఉంది వీడియోలో. ఏకంగా యుద్ధ ట్యాంకునే ఎత్తుకుపోయిన రైతుపై ప్రశంసలు కురుస్తున్నాయితమ దేశంపై దాడి చేసేందుకు రష్యా బలగాలు యుద్ధ ట్యాంకర్‌తో ఓ ప్రాంతానికి చేరుకున్నట్లు యుక్రెయిన్ రైతు తెలుసుకున్నాడు.
ఏదోకటి చేయాలనుకున్నాడు. తన దగ్గర ఉన్న ట్రాక్టర్‌తో యుద్ధ ట్యాంకు ఉన్న చోటికి చేరుకున్నాడు. అంతే గుట్టుచప్పుడు కాకుండా తన ట్రాక్టర్‌కు ఆ యుద్ధ ట్యాంకర్‌ను అనుసంధానం చేసి అక్కడి నుంచి రయ్ మంటూ ట్రాక్టర్ పై దూసుకుపోయాడు.ఊహించని ఈ ఘటనకు బిత్తరపోయి వెంటనే తేరుకున్న రష్యా సైనికుడు ఆ ట్రాక్టర్ వెనుకాలే పరుగెత్తాడు