యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ-ఆలయ పునః ప్రారంభం నేడే


యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి మూలవరుల
దర్శనాలకు శుభతరుణం ఆసన్నమైంది. సోమవారం ఆలయ ఉద్ఘాటన ఘనంగా జరగనుంది. ఉదయం 9 గంటలకు మహాపర్వం మొదలు కానుంది. ఆ తర్వాత ఆలయంలో దైవ దర్శనాలకు తెరతీయనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి.

దేవాలయానికి దిగువన ప్రధాన ఆలయ గర్భాలయాన్ని తలపించే రీతిలో తాత్కాలిక పద్ధతిలో దీన్ని నిర్మించారు. 2016 ఏప్రిల్‌ 21న బాలాలయంలో స్వామివారికి ప్రాణప్రతిష్ట చేశారు. అప్పట్నుంచీ ఆరేళ్ల సుదీర్ఘ కాలం పాటు బాలాలయమే యాదగిరీశుడి నిలయంగా మారి భక్తులకు దర్శనభాగ్యం కల్పించింది. 

ఆరేళ్ల పాటు యాదగిరి నిలయంగా భక్తులకు స్వామివారి దర్శనం కల్పించిన బాల ఆలయానికి అధికారులు సెలవు పలికారుఆరేళ్లుగా ఎదరు చూస్తున్న యాదాద్రి నరసింహుని దివ్వదర్శనం మరి కొన్ని గంటల్లో భక్తులకు కలుగనుంది. ఇంత కాలం స్వామి వారి దర్శన భాగ్యం కలిగిన బాలాలయం మూత పడుతోంది. ఇక దివ్వధామంగా రూపుదిద్దుకున్న ఈ శిల్పకళా ఆలయంలో కొలువు దీరిన నరసింహుని తొలిభక్తునిగా రేపు కేసీఆర్‌ రానున్నారు