ప్రతి రోజు స్త్రీమూర్తులదే. తల్లిగా, అక్కగా, చెల్లిగా, భార్యగా మమతానురాగాలు పంచే స్త్రీమూర్తికి ప్రతిరోజూ మహిళా దినోత్సవమే. మాతృదేవోభవ,పితృదేవోభవ,ఆచార్యదేవోభవ,అతిధిదేవోభవ అని “స్త్రీ”ని ఉపనిషత్తులో అందరికంటే అగ్రపూజ అందవలసిన మాతృమూర్తిగా అభివర్ణించారు.
స్త్రీ అను పదములో ‘స’కార, ‘త’కార, ‘ర’కారములున్నాయి. ‘ స’ కారము సత్వగుణానికి,’త’ కారము తమోగుణానికి, ‘ర’ కారము రజోగుణానికి ప్రతీకలుగా మన పెద్దలు చెబుతారు. ప్రకృతికి ప్రతీకగా స్త్రీని చెబుతారు.నేడు స్త్రీలు పురుషులతో సమానంగా… అన్నిరంగాల్లో రాణిస్తున్నారు.
ఋగ్వేదం అనేది పురుషునికి మరియి ఈ సభ్యసమాజానికి సూర్యకాంతి వంటిది అని స్త్రీలు తమ విద్యాశోభతో గృహాన్ని అనుకూలంగా తీర్చి దిద్దే శక్తి కేవలం స్త్రీకే సాధ్యపడుతుంది. స్త్రీ భావితరాలకు శిక్షణ,రక్షణగా నిలుస్తుందని తెలియజేసింది. వేదాల తర్వాత అంతంటి మహోన్నతమైనది మనుస్మృతి కూడా మహిళలకు మహోన్నత స్థానం ఇచ్చింది.