టీడీపీ పట్టణ అధ్యక్షుడు (మాజీ) మునగపాటి మారుతి రావు పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ పరిణామం కాస్త ఆసక్తికరంగా ఉన్నా రేపటి వేళ ఈ చేరిక ఎలా ఉండనుందో అన్నదే కొద్దిగా చర్చకు తావిస్తోంది.
మార్చి14నపార్టీ ఆవిర్భావ ఉత్సవ సమయానికి ఇంకా ఎక్కువ చేరికలు ఉంటాయని మార్చి14న జరిగే ఉత్సవాలకు ఇంకా ఎక్కువ మంది ఇతర పార్టీ నాయకులు వచ్చి చేరనున్నారని జనసేన లీడర్ నాదెండ్ల అంటున్నారు.
ఇక లోకేశ్ నియోజకవర్గంగా చెప్పుకునే మంగళగిరిలో గత సారి పోటీ చేసి ఓడిపోయారు.ఆ విధంగా లోకేశ్ కు ఇలాంటి చేరికలు ఓ విధంగా తలనొప్పిగా మారే ఛాన్స్ ఉంది..ఎందుకంటే ఇంతవరకూ ఇతర పార్టీల నాయకుల చేరికలపై పవన్ ఏనాడూ పెద్దగా దృష్టి సారించలేదు.ఓ విధంగా గడిచిన రెండు దఫాల ఎన్నికల్లోనూ ఓ విధంగా టీడీపీకి మరోవిధంగా వైసీపీకి సాయం చేస్తూనే వచ్చారు.ఇప్పుడు కూడా తాను పార్టీని బలోపేతం చేయకపోతే జనసేన మనుగడ కష్టమేనన్న భావనలో ఉన్న పవన్ తన స్టాండ్ మార్చేస్తున్నారు. త్వరలో ఇంకొందరిని పార్టీలో చేర్చుకుని వచ్చే ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు గెలుచుకోవాలన్నదే పవన్ వ్యూహం అని సమాచారం.