రాపాక హైలెట్..జనసేన సభకు నో ఎంట్రీ అని


జనసేనకు ఏపీలో బరువు మిగిల్చిన ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ ని జన సైనికులు ఎపుడూ గుర్తు చేసుకుని బాధపడతారుఆయన్ని  వైసీపీ ఎమ్మెల్యేగానే చూస్తున్నారు. అయితే ఆయన్ని తలచుకోవడం మాత్రం జనసైనికులు మానడంలేదు. 

తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం వద్ద జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభ వద్ద జనసేన నాయకుల పెద్ద పెద్ద కటౌట్లు కనిపిస్తున్నాయి. ఇక ఎటు చూసినా పవన్ కళ్యాణ్ కటౌట్లకు కొరత లేనే లేదు.


అయితే వాటి మధ్యన ఒక పోస్టర్ కూడా ఇపుడు హైలెట్ అవుతోంది. అదే జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ది. ఆయనకు జనసేన సభకు నో ఎంట్రీ అని జనసైనికులు ఫోటో పెట్టి మరీ చెప్పేశారు. బహిరంగ సభకు రాపాకు ప్రవేశం లేదు అని కూడా పక్కా క్లారిటీగా చెప్పేశారు.  ఇట్లు మీ పల్లకీ మోసిన జనసైనికులు అని కూడా రాపాక  ఫోటో కింద రాశారు.
తాము మెచ్చుకుని గెలిపిస్తే అందలాలు ఎక్కిస్తాం కాదని వెళ్తే ఇలా మర్యాదలు కూడా చేస్తామని చెప్పడమే ఈ రాపాక ఫోటోతో కూడిన పోస్టర్ అని అంటున్నారు. మొత్తానికి రాపాక ఈ సభకు రారు రాలేరు ఆయన సైతం వైసీపీతో మానసికంగా కలసి ట్రావెల్ చేస్తున్న సందర్భం.  
దాంతో వారి బాధ ఆవేదన ఏంటి అన్నది అర్ధమవుతోంది. తాము కష్టపడి ఎమ్మెల్యేను గెలిపిస్తే ఆయన వెళ్ళి వెళ్ళి ప్రత్యర్ధి పార్టీ పల్లకీ మోస్తున్నారు అని జనసైనికుల ఆగ్రహంగా ఉంది. దాన్ని వారు ఇప్పటం సభ వద్ద పోస్టర్ పెట్టి మరీ ప్రదర్శించడం ద్వారా జనసేన ఫైర్ ఏంటో చెప్పేశారు.అయినా కూడా జనసైనికులు మాత్రం ఆయన మీద సెటైరికల్ గా ఇలా రివేంజ్ తీర్చుకుంటున్నారు అనే అంటున్నారు.