ప్రజలకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం.. విద్యుత్‌ చార్జీల భారీగా పెంపు


ఒక వైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, నిత్యావసర
వస్తువుల ధరలు పెరుగుతుండటంతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు మరో భారం మోపింది ఏపీ ప్రభుత్వం. ప్రజలకు కరెంట్‌ సంస్థలు షాక్‌ ఇచ్చాయి. అన్ని స్లాబుల్లో ధరలు పెరిగాపోయాయి. ఈ పెంపు ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి వస్తుంది. గతంలో ఉన్న కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్‌లుగా రేట్లను ఖరారు చేశారు. సామాన్యులు ఎక్కువగా వాడే యూనిట్లలోనే రేట్లు ఎక్కువగా పెరిగాయి. 

మొత్తంగా ఎక్కువగా సామాన్యులపై పడే అవకాశం ఉంది. ఇప్పటికే ధరల పెరుగుదలతో సతమతవుతున్న ఏపీ (AP) ప్రజలకు విద్యుత్‌ చార్జీలను పెంచుతూ షాకిచ్చింది ప్రభుత్వం.30 యూనిట్లకుపైగా వాడిన వారికి ఈ పెంపు వర్తించనుంది. పెరిగిన విద్యుత్ టారిఫ్‌ను బుధవారం ఏపీఈఆర్సీ (APERC) చైర్మన్ విడుదల చేశారు.  30 యూనిట్ల వరకు యూనిట్‌కు 45 పైసలు పెంపు

31-75 యూనిట్ల వరకు యూనిట్‌కు 91 పైసలు పెంపు

76-125 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.1.40 పెంపు

126-225 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.1.57 పెంపు

226-400 యూనిట్లకు రూ.1.16 పైసలు పెంపు 

400 యూనిట్లు దాటితే యూనిట్‌కు 55 పైసలు పెంపు