హైదరాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.. బోయిగూడలోని ఓ స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు సజీవదహనం అయ్యారు.. ఇవాళ తెల్లవారుజామను స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది.. అందులో పనిచేస్తున్న కార్మికులు మంటల్లో చిక్కుకుపోయారు.. ఇద్దరు కార్మికులను ఫైర్ సిబ్బంది కాపాడారు..
ఇక, స్క్రాప్ గోదాం పక్కనే టింబర్ డిపోలు ఉన్నాయి.. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన ఎనిమిది ఫైర్ ఇంజన్లు.. మంటలను అదుపుచేశాయి.. కానీ, అప్పటికే 11 మంది కార్మికులు సజీవదహనం అయ్యారు.. ఈ ఘటనలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్టు తెలుస్తోంది. మృతులంతా బీహార్‌కు చెందిన కార్మికులుగా సమాచారం అందుతోంది..కానీ, గోదాంలో ఎలాంటి రక్షణ చర్యలు లేవని ఆరోపణలు ఉన్నాయి..
షార్ట్ సర్క్యూట్ కారణంగా స్క్రాప్ గోదాంలో మంటలు చెలరేగి.. గోదాం మొత్తం వ్యాపించాయి.. స్క్రాప్ దుకాణంలో చెత్త కాగితాలు, ప్లాస్టిక్ కాలి, మందు బాటిళ్లు సామాన్లు ఉండడంతో మంటలు వ్యాపించాయి.. కార్మికులు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినట్టుగా చెబుతున్నారు.. ఇక, మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు గాంధీ నగర్ పోలీసులు.