యమజాతకుడు అంటే వీడే


నిర్లక్ష్యంగా సైకిల్ తొక్కుతూ వచ్చిన ఓ బాలుడు చావు
అంచులవరకు వెళ్లి వచ్చాడు. క్షణకాలంలో ప్రాణాలు పోయి ఉండేవి. నాలుగో తరగతి విద్యార్థి బాలుడు  సైకిల్ పై పేరు జాతీయ రహదారి వైపు వస్తుండగా అటుగా వెళ్తున్న బైక్ ను ఢీ కొట్టాడు. ఆతర్వాత ఎం జరిగిందంటే ..రోడ్డు పై వేగంగా వెళ్తున్న వాహనాలను పట్టించుకోకుండా ఇమ్దాద్‌ అనే బాలుడు వేగంగా సైకిల్ తొక్కుతూ రోడ్డు పైకి వచ్చాడు.. ఇంతలో అటుగా వెళ్తున్న ఓ  బైక్‌ను ఢీకొని రోడ్డుపై పడిపోయాడు.

ఆ తర్వాత అటునుంచి వేగంగా కర్ణాటకకు చెందిన బస్సు సీన్ లోకి వచ్చేసరికి అందరి గుండె ఆగినంత పనిఅయ్యింది. బైక్‌ను సైకిల్ ఢీకొట్టిన వెంటనే ఇమ్దాద్ రోడ్డుపై నుంచి పక్కకు పడిపోయాడు. ఆ వెనకే వచ్చిన బస్సు ఇమ్దాద్ సైకిల్‌పై పైకి ఎక్కేసింది. బైక్ ఢీ కొట్టడంతో ఇమ్దాద్‌ రోడ్డు కింద పడిపోయి రోడ్డుకు అటు వైపు ఈడ్చుకుంటూ వెళ్ళాడు . కొచం ఉంటే ఆ బస్సు అతడి పైకి ఎక్కేది.  అదృష్టవశాత్తూ ఆ చిన్నారి పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఎల్‌ఎస్‌ఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినందుకు ఇమ్దాద్ తండ్రి అబూ బకర్ అతడికి సైకిల్‌ను కొనిచ్చారు.  సైకిల్ తుక్కుతుక్కు అయినప్పటికీ ఇమ్దాద్‌కి ఇంకాలేదు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్‌గా మారింది.