రైతు గెలిచాడు.. అమరావతి నిలిచింది’



రైతు గెలిచాడు.. అమరావతి నిలిచింది’..
 807 రోజులుగా ఏపీ రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. అమరావతిపై గురువారం హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పు పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వెలగపూడి గ్రామానికి చెందిన రైతులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తమ ఉద్యమానికి మద్దుతుగా నిలిచిన వివిధ పార్టీల నేతలు, మీడియాకు పాదాభివందనాలు తెలిపారు. హైకోర్టు తీర్పుతోనైనా జగన్ ప్రభుత్వం మారాలని, సీఆర్డీయే చట్టం ప్రకారం తమకు న్యాయం చేయాలని కోరారు.

ఇప్పటికైనా ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని జగన్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఇంతవరకు తాము పండుగలు చేసుకోలేదని, ఈ రోజే తమకు పండగ రోజని రైతులు పేర్కొన్నారు. ఈ విజయం రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజలదని అన్నారు.