దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మానియా నడుస్తుంది. ఇప్పటికే పలు చోట్ల బెనిఫిట్ షోలు పడ్డాయి. ఓవర్సీస్ లో కూడా షోలు పడటంతో టాక్ బయటకి వచ్చేసింది. సినిమా చూసిన వారంతా అద్భుతం అంటూ పొగిడేస్తున్నారు. సినిమా అదిరిపోయింది అంటూ ప్రశంసిస్తున్నారు. ఫ్యాన్స్, ప్రేక్షకులు నుంచి సెలబ్రిటీల వరకు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.
ఇక మన సెలబ్రిటీలు సైతం థియేటర్స్ కి వెళ్లి బెనిఫిట్ షో చూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ టీం కూడా థియేటర్లలో ఫ్యామిలీ, అభిమానులతో కలిసి సినిమా చూశారు. ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి AMB సినిమాస్ లో బెనిఫిట్ షో చూడగా రాజమౌళి, రామ్ చరణ్ భ్రమరాంబ థియేటర్లో కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూశారు. రామ్ చరణ్ తో పాటు భార్య ఉపాసన, మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కూడా థియేటర్ కి వచ్చారు.