చంద్రునికి పెను ముప్పు తప్పింది. ఏడేళ్ల క్రితం అదృశ్యమైన ఓ భారీమూడు టన్నుల బరువైన ఆ రాకెట్ శకలం మార్చి 4న (శుక్రవారం) చంద్రునికి అత్యంత సమీపంగా దూసుకెళ్లింది. ఇదేరోజున ఆ రాకెట్ చంద్రునికి దగ్గరగా దూసుకొచ్చి ఢీకొట్టే అవకాశం ఉందని ఖగోళ సైంటిస్టులు ముందుగానే అంచనా వేశారు. అయితే అదృష్టవశాత్తూ ఆ రాకెట్ శకలం గంటకు 9,300 కిలోమీటర్ల వేగంతో చంద్రుని ఉపరితలంపై నుంచి అతిసమీపంగా దూసుకెళ్లింది.
ఈ క్రమంలో రాకెట్ శకలం వేగానికి చంద్రుని ఉపరితలంపై వందల కిలోమీటర్ల వరకు దట్టమైన ధూళి పైకి ఎగిసింది.ఏడేళ్ల క్రితం అదృశ్యమైన ఈ రాకెట్ శకలం అపసవ్య దశలో చంద్రుని దిశగా దూసుకెళ్తోందని, అది కచ్చితగా చంద్రున్ని ఢీకొట్టే అవకాశం ఉందని స్పేస్ ఏజెన్సీలు సైతం అంచనా వేశాయి. ఇంతకీ ఈ రాకెట్ ఎవరిది అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎలన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్ నుంచి ప్రయోగించిన రాకెట్ అని కొందరు అంటుంటే.. కాదు కాదు.. అది చైనా ప్రయోగించిన రాకెట్ అని మరికొందరు వాదిస్తున్నారు. చైనా మాత్రం తీవ్రంగా ఖండిస్తోంది.
ఈ రాకెట్ శకలం చంద్రున్ని ఢీకొట్టినప్పటికీ దాని ప్రభావం స్వల్పంగానే ఉంటుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఈ రాకెట్ శకలం పరిశోధకుల టెలిస్కోపులకు చిక్కనంత వేగంగా దూసుకెళ్లింది. వందల కిలోమీటర్ల వరకు ధూళి పైకి ఎగియడంతో శాస్త్రవేత్తలు అలర్ట్ అయ్యారు. ఏం జరిగి ఉంటుందా? అని పరిశీలించారు. అది అదృశమైన రాకెట్ శకలం దూసుకెళ్లిన అనవాళ్లుగా సైంటిస్టులు గుర్తించారు. రాకెట్ శకలం దూసుకెళ్లిన ప్రాంతంలో చంద్రుని చుట్టూ దాదాపుగా 3 టన్నుల వ్యర్థాలు పేరుకుపోయినట్టు గుర్తించారు.