కాంగోలో ఘోర రైలు ప్రమాదం,, 60 మందికి పైగా మృతి


ఈ దేశంలో రైళ్లు పట్టాలు తప్పడం
.. రైలు ప్రమాదాలు తరచుగా జరుగుతూనే ఉంటాయి..ముఖ్యంగా DRCలో రైలు పట్టాలు తప్పడం సర్వసాధారణం. 

కాంగోలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 60 మందికి పైగా మృతి చెందినట్లు అక్కడి మీడియాలో వెల్లడవుతుంది. ఈ ప్రమాదంలో అనేక మందికి తీవ్ర గాయాలవగా.. మృతుల్లో చిన్నారులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. లుయెన్ నుంచి టెంకే పట్టణం వైపు ప్రయాణిస్తున్న రైలు.. బయోఫ్వే గ్రామం సమీపంలో పట్టాలు తప్పింది.

ఈ ప్రమాదంలో ఏడు రైలు బోగీలు పక్కనే ఉన్న లోయలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది.ప్రమాదం సమాచారం అందుకున్న సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ రైలులో మొత్తం 100 మందికి పైగా ప్రయాణికులు ఉండగా.. ఇప్ప‌టి వ‌ర‌కూ 61 మంది మరణించారనీ, మ‌రో 52 మంది గాయపడ్డార‌ని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ప్రావిన్షియల్ గవర్నర్ ఫిఫీ మసుకాను స్థానిక మీడియాతో పేర్కొన్నారు.