శత్రువు ఎంత దూరంలో ఉన్నా సరే.. అతడి తూటాకు దొరికిపోవాల్సిందే. అతడున్న రేడియస్ లో ఎక్కడైనా అడుగు పెట్టడం అంటే మృత్యువును గంటకొట్టి ఆహ్వానించడమే.ప్రపంచం మొత్తంలోనే అత్యుత్తమ స్నైపర్ గా పేరు పొందాడు వాలి.
మామూలు స్నైపర్ రోజుకి నలుగురిని లేదా ఐదుగురిని మాత్రమే చంపగలడు. కానీ, వాలి… కనీసం రోజుకు 40మందిని తన తుపాకీకి బలిపెడతాడు. ఎంత దూరంలో ఉన్నా టార్గెట్ ని అయినా ఎంతో ఈజీగా ఛేదిస్తాడీ వాలి. 2017లో 3వేల 540 మీటర్ల దూరంలో అంటే మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐఎస్ జిహాదీని కూడా కాల్చి చంపాడు వాలి. ఇంతటి సుధీర్ఘ దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేధించడంలో అతడిదే రికార్డ్.
యుక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ పిలుపుమేరకు బుధవారం వచ్చిన అతడు.. రెండు రోజుల్లోనే ఆరుగురు రష్యా సైనికుల్ని చంపేశాడట. ఈ వాలి.. ఫ్రెంచ్-కెనడియన్ కంప్యూటర్ సైంటిస్ట్. రాయల్ కెనడియన్ రెజిమెంట్‌లో పనిచేశాడు. వాలి అనేది అతడి నిక్‌నేమ్. అరబిక్ భాషలో ఆ పదానికి సంరక్షకుడని అర్థం. తన విధుల్లో భాగంగా అఫ్గాన్‌లో పదుల సంఖ్యలో శత్రువులను మట్టుపెట్టిన క్రమంలో అక్కడి ప్రజలు ఈ పేరు పెట్టారు. ఇక అఫ్గానిస్థాన్, ఇరాక్, సిరియాలో జరిగిన పోరాటాల సమయంలో అతడి టాలెంట్‌తో గుర్తింపు పొందాడు
ఈ కెనడియన్ స్నైపర్ ఇప్పుడు రష్యన్ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు. కెనడాకు-రష్యాకు లింక్ ఏంటి అంటే.. రష్యాపై సర్వశక్తులు ఒడి పోరాడుతున్న యుక్రెయిన్ కు నేను సైతం అంటూ మద్దతు తెలుపుతూ యుద్ధభూమిలో వాలిపోయాడు వాలి. ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇప్పుడు వాలి వచ్చాడు అన్నట్టు మారిపోయింది అక్కడి సీన్.
రామాయణంలో వాలి ఎంత బలవతుండో, ఇప్పటి వాలి కూడా అంతే బలశాలి. అప్పటి వాలి ముందు శత్రువు నిలబడితే అతడి శక్తి మొత్తం వాలికి వెళ్లినట్లు.. ఇప్పటి వాలి ముందు కూడా శత్రువు నిలబడడు. అందుకే అతి శక్తిమంతమైన దేశంపైకి దండెత్తాడు ఈ వాలి. రష్యాకు వ్యతిరేకంగా కదనరంగంలోకి కాలు దువ్వాడు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పిలుపుతో ఆ దేశానికి మద్దతుగా యుద్ధ రంగంలోకి అడుగుపెట్టాడు.