పవన్ రాకతో.. పార్టీ నేతలు సభకు భారీ ఏర్పాట్లు చేశారు. నరసాపురంలో జరిగే మత్స్యకార మహాసభకు ఆయన హాజరుకానున్నారు. ఇందుకోసం.. ఉదయం 10గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నరసాపురం వెళ్లి మధ్యాహ్నం జరిగే సభలో పాల్గొంటారు. ఇవాళ జరిగేది మత్స్యకార సభే అయినా.. పవన్ టార్గెట్ వేరే ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. త్వరలోనే నరసాపురం నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది.నర్సాపురంఇటీవలే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనపై అనర్హత వేటు కోసం ప్రయత్నిస్తున్నారని.. వాళ్లకు తానే సమయం ఇస్తున్నానని వైఎస్సార్‌సీపీ అధిష్టానానికి సవాల్ విసిరారు. వారంలో నిర్ణయం చెప్పాలని.. తనపై అనర్హత వేటు వేయకపోతే తానే రాజీనామా చేస్తానని చెప్పారు. తమ పార్టీ వాళ్లు రెండేళ్లగా ఎక్కిన గుమ్మం, దిగిన గుమ్మంతో బిజీగా ఉన్నారు.
కుదిరితే స్పెషల్ ఫ్లైట్, కుదరకపోతే అందిన ఫ్లైట్‌లో తిరుగుతూ వరుసగా ఫిర్యాదులు ఇస్తున్నారు.. త్వరలోనే అనర్హత వేటు వేస్తారని సొల్లు కబుర్లు చెబుతున్నారని.. తన పార్లమెంట్ సభ్యత్వం తీసేయాలని ప్రయత్నిస్తున్నారని.. అయితే వాళ్లు ఎంత వరకు విజయం సాధిస్తారో చూద్దామన్నారు.. వారు ప్రయత్నాలు ఫలించకపోయినా.. తాను రాజీనామా చేసి.. ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని.. అంతేకాదు భారీ విజయం సాధిస్తున్నానని ప్రకటించారు.దీంతో ప్రస్తుతం నర్సాపురం పవన్ పర్యటన ఆసక్తి పెంచుతోంది. ఒకవేళ నిజంగా రఘురామ ఎన్నికలకు వెళ్తే..మద్దతుతోనే వెళ్తారు అన్నది బహరింగ రహస్యమే.. ప్రస్తుతం బీజేపీతోపొత్తు ఉంది.
ప్రస్తుత పరిస్థితుల్లో రఘురామ అక్కడ విజయం సాధించాలి అంటే పవన్ సపోర్ట్ తప్పని సరి.. పవనకు తోడు మద్దతు ఇస్తే రఘురామ విజయం కష్టం కాకపోవచ్చు.. అయితే పొత్తుల సంగతి ఎలా ఉన్నా.. ముందుగానే పవన్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టు జనసైనికుల టాక్.. ప్రభుత్వంపై తీవ్ర అసహనంతో ఉన్న వర్గాలను దగ్గర చేసుకోవడమే పవన్ టార్గెట్ గా చెబుతున్నారు.కేవలం ఉప ఎన్నిక అనే కాదు.. వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఈ జిల్లాపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు జనసైనికుల టాక్.. ముఖ్యంగా ప్రభుత్వంపై ఏఏ వర్గాలు అసహనంతో ఉన్నాయో.. ఆయా వర్గాలను చేరువ చేసుకోవడం జన సేన రాజకీయ వ్యూహాల్లో ఒకటిగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే రేపటి పర్యటన ఉంటుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనిలో భాగంగానే ఆయన ఇవాళ మత్స్యకార అభ్యున్నతి సభను సక్సెస్ చేసే ఉద్దేశంలో ఉన్నారు. ఆ బాధ్యతను ఇప్పటికే జనసైనికులకు అప్పచెప్పినట్టు సమాచారం.