చరిత్ర కోసం మీరు కాదు. మీ కోసం చరిత్ర దేవర,,బండ్ల గణేశ్ ట్వీట్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ప్రధాన పాత్రలో నటించిన
భీమ్లా నాయక్  సినిమా శుక్రవారం విడుదలైంది. నిన్నటి నుంచి థియేటర్ల వద్ద పవన్ ఫ్యాన్స్ రచ్చ షూరు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇవాళ విడుదలైన భీమ్లా నాయక్ సినిమా అదిరిపోయిందని.. బాక్సాఫీస్ హిట్ కావడమంటూ సోషల్ మీడియాలో పవన్ హవా నడుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా అంటే బండ్ల గణేష్ హడావిడి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. పవన్ పై ఆయన తనదైన స్టైల్లో ప్రశంసలు కురిపిస్తుంటారు. బండ్ల గణేశ్ ఇచ్చే స్పీచ్‏లకు పవన్ అభిమానులు ఫిదా అవుతుంటారు. అయితే గత కొద్ది రోజులుగా భీమ్లా నాయక్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గురించి ఆయన చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అయితే బండ్ల గణేశ్.. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు ఎందుకు రాలేదు అనేది మాత్రం తెలియరాలేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈరోజు భీమ్లా నాయక్ విడుదలైన సందర్భంగా.. పవన్ పై.. భీమ్లా నాయక్ సినిమా పై బండ్ల గణేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ” మా దేవర నటించిన భీమ్లా నాయక్ దెబ్బకి బాక్సులు బద్దలవ్వాలని రికార్డులు చిరిగిపోవాలని దిక్కులు పిక్కటిల్లేలా అభిమానులు స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ..చరిత్ర కోసం మీరు కాదు. మీ కోసం చరిత్ర దేవర ” అంటూ  షేర్ చేశారు.