సమతామూర్తి సన్నిధిలో పవన్ కళ్యాణ్


సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్
ఆదివారం సాయంత్రం ముచ్చింతల్ లోని సమతామూర్తికేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సమతామూర్తి ఆలయ విశేషాలను తెలుసుకున్నారు.విగ్రహంచుట్టూ ఉన్న 108 దివ్యదేశాలను దర్శించుకున్నారు. అనంతరం ప్రవచన మండపంలో చినజీయర్ స్వామిని కలిసి ఆశీర్వచనాలు అందుకున్నారు.

 ముచ్చింతల్ లో పవన్ కళ్యాణ్ ను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు.హైదరాబాద్ పరిధిలోని ముచ్చింతల్ లో శవ్రీరామానుజం సహస్రాబ్ది వేడుకల్లో సినీ నటుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
రామానుజాచార్య సమతామూర్తి విగ్రహం వద్ద పూజలు చేశారు. అనంతరం చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.