రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రశ్నించే స్థాయి నుంచి పాలించే స్థాయికి జన సేన పార్టీ ముందుకి వెళ్తుందని దానికి నిదర్శనమే ఇతర పార్టీల నాయకులు జనసేనలో చేరడమేనని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు అన్నారు.
ఈ రోజు చింతలపూడి నియోజవర్గం చింతలపూడి మండల జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై చీదరాల మధుబాబు , చీదరాల మల్లికార్జున రావు , శేషపల్లి గంగాధరరావు మరియు ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం నుంచి చవ్వాకుల వీరభద్రరావు , ఓగిరాల రాజేష్ , మోటూరు కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, PAC సభ్యులు కనకరాజు సూరి సమక్షంలో భీమవరం పార్టీ కార్యలయంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. సుమారు 50 మంది జనసేన పార్టీ లో చేరారు
ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ ఇన్చార్జి చిర్రి బాలరాజు , చింతలపూడి నియోజకవర్గ ఇంచార్జ్ మేక ఈశ్వరయ్య అలాగే జిల్లా కమిటీ నుంచి జిల్లా ప్రధాన కార్యదర్శులు కరాటం సాయి ,చెనమల్ల చంద్రశేఖర్ , సెక్రెటరీ గడ్డమణుగు రవికుమార్ ,జిల్లాకమిటీ సభ్యులు , మండల ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రెసిడెంట్లు చింతలపూడి , పోలవరం, ఉండి నియోజకవర్గల నాయకులు, జన సైనికులు, వీర మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు