పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన భీమ్లా నాయక్‌పై భారీ అంచనాలున్నా్యి. రానా, పవన్‌లు కలిసి నటిస్తుండడం.. త్రివిక్రమ్ మాటలు అందిస్తుండడంతో ఈ సినిమాపై సినీ అభిమానుల దృష్టిపడింది. ఇక కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఎట్టకేలకు ఫిబ్రవరి 25న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యింది. ఇందులో భాగంగానే సోమవారం (ఫిబ్రవరి 21) రోజున ప్రిరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించింది.
ఈ ప్రోగ్రామ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ప్రత్యేక అతిథిగా కూడా ఆహ్వానించారు. అయితే ఆంధ్రప్రదేశ్ మంత్రి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో చిత్ర యూనిట్ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కానీ ప్రిరిలీజ్ ఈవెంట్‌ను ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇక సినిమా విడుదలకు కేవలం మూడు రోజుల వ్యవధి ఉన్న నేపథ్యంలో ఈవెంట్‌ను నిర్వహిస్తారా.? లేదా.? అన్న చర్చ కూడా జరిగింది.అయితే తాజాగా చిత్ర యూనిట్ ప్రిరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మంత్రి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలను బుధవారం ఉదయం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం సాయంత్రం ఈవెంట్‌ను జరపాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం దాదాపు కాన్ఫామ్ అయినట్లు సమాచారం. ముందుగా అనుకున్న యూసుఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్‌లో రేపు సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ ప్రారంభంకానున్నట్లు సమాచారం. మరికాసేపట్లో చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది.