సితారా ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌లో భీమ్లా నాయక్ రిలీజ్ కు ముస్తాబవుతుంది. ఈ క్రమంలో ట్రైలర్ ను సోమవారం రాత్రి 9గంటలకు రిలీజ్ చేశారు. నాయక్.. నీ ఫ్యాన్స్ వెయింటింగ్ ఇక్కడ అంటూ రానా చెప్పిన డైలాగ్ కు పవన్ కల్యాణ్ వాకింగ్ కు ఫ్యాన్స్ కు మినీ పండుగను చూపించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో రానా దగ్గుబాటి మరో హీరోగా తెరకెక్కిన ఈ సినిమాని సాగర్ చంద్ర దర్శకత్వంలో సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా యూ/ఏ సర్టిఫికేట్ దక్కించుకుంది.పవన్ కు జోడీగా నటిస్తున్న నిత్యామేనన్ డైలాగులు హీరో పవన్ కల్యాణ్, రానా డైలాగులే హైలెట్.