ఉద్యోగులు రోడ్డు మీదకు రావడం బాధ కలిగించింది.జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌


 ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పీఆర్సీ సాధన సమితి నేడు ‘ఛలో విజయవాడ’  కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మరోవైపు పోలీసులు ఈ కార్యక్రమానికి అనుమతులు ఇవ్వకపోవడంతో బెజవాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాగా ఇలా రోడ్ల మీదకు ఉద్యోగులు వచ్చి నిరసన తెలపడం చాలా బాధ కలిగించిందని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌  తెలిపారు.

 ఉద్యోగులను కించపరిచే మాటలు, బెదిరించే ధోరణిని మానుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి పవన్‌ సూచించారు. ఉద్యోగుల నిరసనకు జనసేన పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.వైసీపీ నాయకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఉద్యోగులు, ఎన్‌జీవోలు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు తమ డిమాండ్ల కోసం సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం సుహృద్భావ వాతావరణంలో చర్చలు చేపట్టాలి. ఉద్యోగులను అవమానించేలా, రెచ్చెగొట్టేలా మాట్లాడకూడదు. వారి న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలి. ఉద్యోగుల నిరసనకు జనసేన పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది’ అని పవన్‌ పేర్కొన్నారు.