ఆవిర్భావ సభతో వైసీపీకి ఫస్ట్ స్ట్రోక్..


పవన్ పార్టీ పెట్టి మార్చి 14 నాటికి ఎనిమిదేళ్ళు
పూర్తి అవుతుందిఅలాంటి జనసేనలో జోరు పెంచాలీ అన్నా జోష్ తేవాలీ అన్నా కూడా భారీ ఎత్తున ఇతర పార్టీలను ఆకర్షించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇక అధికార వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలను తెచ్చి జనసేన  గ్లాస్ లో కొత్త నీరు నింపాలని కూడా మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా చెబుతున్నారు. జనసేనలోకి వైసీపీ నేతలు అంటేనే పొలిటికల్ గా అది సెన్షేషన్ అవుతుంది అని అంచనా వేస్తున్నారు.

ఏపీలో జనసేనను వైసీపీ నేతలు పట్టించుకోవడం లేదు పైగా హేళన చేసి మాట్లాడుతున్నారు. ఆ పార్టీ ఎక్కడ ఉంది అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాటికి ధీటు అయిన జవాబు చెప్పాలీ అంటే ఏకంగా ఫ్యాన్ స్పీడ్ ని తగ్గించేలా కీలకమైన జిల్లాల నుంచి ఆ పార్టీ నేతలను తీసుకు వచ్చి జనసేన కండువాలు కప్పాలని చూస్తున్నారు.

దీనికి మంచి స్పందన కూడా లభిస్తోంది అంటున్నారు. అదెలా అంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి చాలా మంది వైసీపీ నేతల చూపు అయితే జనసేన వైపు ఉందని అంటున్నారు. అందులో ద్వితీయ శ్రేణి నేతలు అయితే ఆ పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారని భోగట్టా. వారంతా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటున్నారు
తామున్న పార్టీలో టికెట్లు రావు అన్న బెంగ ఒక వైపు ఉంటే గోదావరి జిల్లాలలో సామాజిక వర్గాల ప్రభావం వల్ల కూడా జనసేనలో ఉంటే బెనిఫిట్ అవుతుందన్న లెక్కలతో వారు చేరేందుకు రెడీ అవుతున్నట్లుగా చెబుతున్నరు. ఇంకో వైపు టీడీపీ నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ జిల్లాల నుంచే నేతలు జనసేనలో చేరుతామని కోరుతున్నట్లుగా తెలుస్తోంది.
దీంతో ఈ జాబితా అంతా ఇపుడు జనసేన పెద్దల వద్ద స్క్రూటినీ దశలో  ఉందని అంటున్నారు. పార్టీలోకి  వచ్చే నాయకులు ఒక స్థాయి. అంగబలం అర్ధంబలం మాజీ ఎమ్మెల్యేలు కీలక నేతలు అయిన వారు ప్రజలలో పలుకుబడి ఉన్న వారు అయితే వారిని చేర్చుకోవాలని జనసేన కొలమానం పెట్టుకుంది.
దాంతో ఈసారి జనసేన ఆవిర్భావ సభ మామూలుగా ఉండదని అంటున్నారు. అటు వైసీపీకి గట్టి హెచ్చరికను ఇస్తూనే తమ స్టాండ్ ఏంటి తమ ప్రస్థానం ఏంటి 2024లో తమ పాత్ర ఏంటి అన్నది కూడా సూటిగా స్పష్టంగా పవన్ కళ్యాణ్ ఆ సభలో చెబుతారు అంటున్నారు.
అదే విధంగా ఈ సభ ద్వారా పొత్తుల విషయంలో కూడా క్లారిటీ వస్తుంది అంటున్నారు. మొత్తానికి చూస్తే జనసేనలో చేరే నాయకులు ఎవరు అన్నదే ప్రస్తుతానికి చర్చగా ఉంది. ఈ మధ్య నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఆత్మగౌరవం ఉన్న వారు అంతా వైసీపీని వీడి జనసేనలో చేరాలని కోరారు. మరి దాని ప్రభావం ఎంతవరకూ ఉంటుందో చూడాల్సిందే.