`ఆచార్యరిలీజ్ డేట్ ఇదేనా?


సినీ ఇండస్ట్రీలో అనిశ్చితి నెలకొంది. దీంతో చాలా వరకు చిత్రాల రిలీజ్ లు ఆగిపోయాయి. కొన్ని చిత్రాలు ఓటీటీ బాట పడితే కొన్ని చిత్రాలు డేర్ చేసి థియేటర్లలోకి వచ్చేశాయి. కానీ కొచ్చి చిత్రాలు మాత్రం ప్రస్తుతం వున్న పరిస్థితులు కారణంగా తమ చిత్రాలకు పెట్టిన బడ్జెట్ రికవర్ చేసుకోవడం కష్టం అని భావించిన భారీ చిత్రాల మేకర్స్ తమ చిత్రాల రిలీజ్ లని గత కొన్ని నెలలుగా వాయిదా వేస్తున్నారు.దీంతో చాలా వరకు సినిమాల రిలీజ్ డేట్ ల విషయంలో గత కొంత కాలంగా సందిగ్తత నెలకొంది. భారీ చిత్రాల్లో కొన్ని ఇప్పటికే రిలీజ్ డేట్ లని ప్రకటించేశాయి. మరి కొన్ని అదను కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే ఒకరికి మించి మరొకరు రిలీజ్ డేట్ లని రిజర్వ్ చేసుకుంటుండటంతో చాలా వరకు భారీ చిత్రాల రిలీజ్ డేట్ ల విషయంలో గందరగోళం నెలకొంది. జనవరికి సంక్రాంతి బరిలో దిగాల్సిన `ఆర్ ఆర్ ఆర్`రాధేశ్యామ్ అనూహ్యంగా పోస్ట్ పోన్ కావడంతో `ఆచార్య` ఎఫ్ 3 లాంటి మిగతా చిత్రాలు కూడా తమ రిలీజ్ డేట్ లని మార్చుకున్నాయి.

ఇదే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారబోతున్నట్టుగా తెలుస్తోంది. `ఆర్ ఆర్ ఆర్` ని మార్చి 18 లేదా ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. మార్చి 11న `రాధేశ్యామ్` ని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. అయితే తాజాగా `ఆచార్య` రిలీజ్ పై వినిపిస్తున్న డేట్  పలు అనుమానాలకు తావిస్తోంది. ఏప్రిల్ 1కి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 1న ఈ మూవీ రిలీజ్ కావడం లేదని ఏప్రిల్ 29న విడుదల కాబోతోందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఏప్రిల్ 28న `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ కు రెడీ అవుతుంటే ఒక్క రోజు తేడాతో `ఆచార్య` ఏప్రిల్ 29న విడుదలకు రెడీ కావడం ఏంటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ మార్చి 25కు మారడం వల్లే `ఆచార్య` ఏప్రిల్ 1కి బదులు ఏప్రిల్29ని ఎంచుకున్నారని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందులో నిజం ఎంతన్నది తెలియాలంటే `ఆర్ ఆర్ ఆర్` ఫైనల్ రిలీజ్ డేట్ అయినా బయటికి రావాలి. లేదా `ఆచార్య` మేకర్స్ అయినా తాజా ఈ రిలీజ్ డేట్ పై స్పందించాలి అంటున్నారు నెటిజన్స్.  కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించిన విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటించారు.