మహేశ్ - త్రివిక్రమ్ చిత్రానికి ముహూర్తం ఫిక్స్


మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘అతడు, ఖలేజా’ చిత్రాల తర్వాత రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంతకు ముందే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై యస్.రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇతర నటీనటుల వివరాల్ని త్వరలో వెల్లడికానున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ అభిమానుల్ని ఖుషీ చేయబోతోంది. SSMB28గా రాబోతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 3న పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంఛ్ చేయబోతున్నారు. మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు.  

మహేశ్, త్రివిక్రమ్ కలయికలో దాదాపు పదమూడేళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. యాక్షన్ బ్యా్క్ డ్రాప్ లో త్రివిక్రమ్ స్టైలాఫ్ ట్రీట్ మెంట్ తో సినిమా రూపొందనుంది. ఇప్పటికే త్రివిక్రమ్ స్ర్కిప్ట్ లాక్ చేశారట. ప్రస్తుతం ‘సర్కారు‌వారి పాట’ చిత్రాన్ని కంప్లీట్ చేసే పనిలో మహేశ్ ఉన్నారు. అది పూర్తయ్యాకా మహేశ్  త్రివిక్రమ్ చిత్రానికి షిఫ్ట్ అవుతారు.