*పశువైద్య ఆరోగ్య శిబిరాలు*
గునుపూడి
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గునుపూడి లో పశువైద్యసిబిరం ఏర్పాటు చేసారు స్థానిక పశువుల ఆసుపత్రి ఆవరణంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య హాజరైనారు స్థానిక సర్పంచ్ వేముల సూర్యనారాయణ,నీటి సంఘం అధ్యక్షులు సబ్బవరపు దేవుడు,మాజీ ఎంపిటిసి సూరిబాబు గ్రామ టీడీపీ అధ్యక్షులు పోలపర్తి సాయి
పశువులకు గర్భకోస వ్యాధులు, డీ వర్మింగ్స్,అత్యవసర చికిత్స కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాదిరైతులు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పాడిని అభివృద్ధి చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ తెలియజేసారు.వారంలో రెండురోజులు డాక్టర్ గారు అందుబాటులో అంటారు అత్యవసరం అయితే ప్రత్యేకంగా వచ్చి పశువులకు వైద్యం అందించనున్నారు పశువైద్య అధికారి మోక్షారెడ్డి గారు సిబ్బంది కొరత తో ఇబ్బంది పడుతున్నట్లు స్థానిక నాయకులకు తెలియ జేశారు గ్రామ టీడీపీ అధ్యక్షులు పోలపర్తి సాయి గారు మాట్లాడుతూ సిబ్బంధిగాని మందులు గాని కొరతగా ఉంటే నేరుగా సంప్రదించండి స్పీకర్ గారి దృష్టికి సమస్య తీసుకెళ్ళి పరిష్కారం చేయిస్తామని సాయి గారు చెప్పారు,పశువుల ఆసుపత్రి భవనం శిథిలావస్థలోఈ సమస్య కూడా స్పీకర్ గారి దృష్టికి తీసుకెళతామని కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య అన్నారు
డాక్టర్ మోక్ష గారు మాట్లాడుతూ
రైతులకు ఉపయోగ కరంగా ప్రభుత్వం గోకులం పేరుతో పశువుల షెడ్డులు,గడ్డి పెంపకం,పసు కిసాన్ క్రెడిట్ కార్డులు మరియు వివిధ పథకాలు అందుబాటులో ఉన్నాయి స్థానిక పశువుల ఆసుపత్రిలో వివరాలు తెలియ జేస్తారు
కార్యక్రమంలో సిబ్బంది
అనిమల్ హస్బండ్రి యసిస్తెంట్స్
రవీందర్,అభిరామ్,శిరీష్ పాల్గొన్నారు సుమారు 50 మంది పాడి రైతులు తమ పశువులకు ఈ కార్యక్రమంలో వైద్య సేవలను పొందారు