భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ 100.వ ఆవిర్భావ దినోత్సవం గొలుగొండలో ఘనంగా నిర్వహించారు


భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ 100.వ ఆవిర్భావ దినోత్సవం గొలుగొండలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ మేకా సత్యనారాయణ పతాకాన్ని ఆవిష్కరించారు

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26 తేదీన కాన్పూర్ లో పుట్టిన ఈరోజుకి సిపిఐ వంద సంవత్సరాల ఉద్యమ నేపథ్యంలో అశేషమైన త్యాగాల తోపాటు అనేక ఆటుపోటులను ఎదుర్కొనీ సమ సమాజ స్థాపన కోసం, సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా, బ్యాంకుల జాతీయకరణకు, రెండు వందల ఏళ్ల పాటు బ్రిటిష్ పాలకుల బానిసత్వాన్ని అనుభవించిన భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కొరకు అనేక దీక్షలతో అలుపెరగని సమరం సాగించింది భారత కమ్యూనిస్టు పార్టీ.

భారతదేశంలో పేద,రైతు కార్మిక, ఉద్యోగ,మహిళా, విద్యార్థి ,యువజనులను సమీకరించి వారు హక్కుల కోసం పోరాడింది. దేశవ్యాప్తంగా దున్నేవాడికే భూమి అనే నినాదం ఇచ్చి లక్షలాది ఎకరాల భూములను పేద ప్రజలకు పంచి పెట్టింది సిపిఐ ఎర్రజెండా


భూమికోసం భుక్తి కోసం దేశ పౌరులందరికీ సమానంగా ఉండాలని జైల్లోకి వెరవక,కేసులకు భయపడక,ప్రాణ త్యాగాలను ముద్దాడిన అరుణతార దోపిడీదారులకు సింహ స్వప్నమై, ప్రజలకు ఆపన్న హస్తమై ఎక్కడ పేదవాడికి సమస్య ఉద్భవించిన మేమున్నామంటూ నిలబడింది భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ 


అనేక పోరాటాలు చేసి సాధించుకున్న స్వాతంత్ర్యం, అనేక శ్రమల కూర్చి నిర్మించుకున్న భారత రాజ్యాంగం ప్రమాదంలో పడింది. బిజెపి నరేంద్ర మోడీ నాయకత్వంలో రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని ఎన్నికల ప్రచారాన్ని చేసింది. బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి లౌకిక సామ్యవాద అనే పదాలను రాజ్యాంగ పీఠిక నుంచి తొలగించాలని సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు పెట్టింది. అయినా బిజెపికి బుద్ధి రాకపోగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ పై రాజ్యసభలో అమిత్ షా అంబేద్కర్ అంబేద్కర్ అని నామస్మరణ చేసే కంటే దైవనామస్మరణ చేస్తే ఏడు జన్మలకి సరిపడా స్వర్గం లభిస్తుందని చెప్పడం భారతదేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని రాజ్యాంగ విధ్వంశాన్ని సూచిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగాన్ని మారుస్తామని ఎన్నికల ప్రచారం చేసినందుకు ఈ దేశ ప్రజలు 200 స్థానాలను కట్టబెట్టిన బిజెపికి బుద్ధి రాలేదు ప్రజాస్వామ్యంలో ప్రజలకు రక్షణ కరువై ప్రజా సమస్యలు ఎక్కువైతే పోరాటాలు తప్పవని పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సమితి సభ్యులు జి గురుబాబు, డిసిహెచ్ క్రాంతి, మేకా భాస్కర్ రావు, జి. రాధాకృష్ణ, పి.లోవరాజు, నల్లబెల్లి శ్రీరామ్మూర్తి,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.