9tvdigital అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం జోగంపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో
గిరిజన ఆరాధ్యుడు స్వతంత్ర పోరాటంలో ఆదిమ గిరిజన తెగలకు నాయకత్వం వహించిన బిర్సాముండా 150 వ జయంతి ఉత్సవాలను జోగంపేట జెడ్పి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు వి సరోజినీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యఅతిధిగా హాజరైన గొలుగొండ మండల విద్యాశాఖ అధికారి ఓ.సత్యనారాయణ పూలమాలను వేసి,బిర్సాముండా గొప్పతనమును తెలియజేశారు.అలాగే ప్రధానోపాధ్యాయిని వి.సరోజిని బిర్సాముండా అతిపిన్న వయసులో గిరిజనులకు ఆరాధ్య దైవముగా మారి, వారిలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడానికి చైతన్యం కలిగించిన గొప్ప నాయకుడని, వారిని ఆదర్శంగా తీసుకొని గిరిజన తెగలు స్వతంత్ర పోరాటంలో పాల్గొనడానికి ధైర్య సాహసాలు కలిగించిన వ్యక్తి అని కొనియాడారు. ఆదిమ తెగలకు ధైర్య సాహసాలను నూరిపోసిన బిర్సాముండా పూర్వకాలంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి అమాయక ప్రజలు మోసపోకుండా బ్రిటిష్ కాలంలో వారికి వెన్నుదన్నుగా నిలిచి, గిరిజన జాతిలో చైతన్యం కలిగించిన బిర్సాముండా నేటి తరానికి ఆదర్శప్రాయుడు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి.అప్పారావు, ఎంపీ శ్రీనివాసరావు, బి సుబ్బారావు బి లోవరాజు, జి రవీంద్ర, కే సత్యనారాయణ మరియు మహిళా ఉపాధ్యాయులు మహాలక్ష్మి, ఉషా ప్రభ, భ్రమరాంబిక మరియు విద్యార్థులు పాల్గొన్నారు.