గొలుగొండ మండల కేంద్రంలో డెంగ్యూ వ్యాధి నివారించుటకు డాక్టర్ శ్యామ్ కుమార్ మధుసూదన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు


 అనకాపల్లి జిల్లా గొలుగొండ మండల కేంద్రంలో గొలుగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్యామ్ కుమార్ చీడిగముల ఆరోగ్య కేంద్రం డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో విరేచనాల వల్ల కలిగే ప్రాణనష్టాన్ని మరియు డెంగ్యూ వ్యాధిని నివారించుటకు తీసుకోవలసిన జాగ్రత్తలపై మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్యామ్ కుమార్ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ పిల్లలకు విరోచనాల సమయంలో మరియు విరోచనాలు అనంతరం తల్లిపాలు ఇతర నోట్లు ద్రవాలు మరియు అనుబంధ ఆహారము నిర్విరామంగా ఇవ్వాలి ఆరోగ్య సిబ్బంది సూచనలు మేరకు బిడ్డకు విరోచనాల సమయంలో ఓఆర్ఎస్ ద్రవాలతోపాటు నిర్దేశించిన మోతాదులో జింక్ మాత్రలు 14 రోజులు ఇవ్వాలని తెలిపారు ప్రస్తుతం వర్షాలు అధికంగా కురవడం వల్ల డెంగ్యూ వ్యాధి నివారించుటకు తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించాలని ఇంటిలో ఉన్న నీటి నిలవల మీద దోమలు గుడ్లు పెట్టకుండా మూతలు వేయలని కుళాయిల వద్ద నిల్వ ఉంచకుండా చూడవలెను డ్రైనేజీలలో అడ్డంగా ఉన్న వాటిని తొలగి ంచి నీరు నిల్వ ఉండకుండా నిరంతరం పారేటట్లు చేయాలని ముఖ్యంగా ఎయిర్ కూలర్స్ ఫ్రిజ్లు లలో నిల్వ ఉన్న నీరుని ఎప్పటికప్పుడు తీసివేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కీర్తి సిహెచ్ఓ ప్రసాదు సూపర్వైజర్స్ హెచ్ వి లు ఏఎన్ఎం లు m l h p s ఆశా కార్యకర్తలు హెల్త్ అసిస్టెంట్ లో పాల్గొన్నారు