గొలుగొండ మండలం పోలీసు స్టేషన్ ఏ ఎల్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాలు ప్రజలకు విజ్ఞప్తి.ఎన్నికల కోడ్ 144 సెక్షన్ అమలులో ఉన్నందున గ్రామాలు ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు అందురు సహకరించాలని గుంపులు గుంపులుగా ఉండకూడదు అని ఏ రాజకీయ పార్టీ తరుపున ప్రచారం చేయకూడదని గొలుగొండ ఎస్ఐ కృష్ణారావు ఏ యల్ పురం ఎస్సై ఉపేంద్ర హెచ్చరించారు. ఇప్పటికే కొంతమంది పై బైండోవర్ కేసులు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. గ్రామాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గొడవలకు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడిన వెంటనే పోలీసు స్టేషన్ కు సమాచారం అందించాలని ఎస్ఐ కృష్ణారావు ఎస్సై ఉపేంద్ర తెలిపారు. కాబట్టి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వరకు రాజకీయ నాయకులు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎన్నికల కోడ్ ఎవరు అతిక్రమించిన చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తామని ఎస్ఐ లు కృష్ణారావు ఉపేంద్ర హెచ్చరించారు.