ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియా నందు తప్పుడు ప్రచారాలను మరియు ట్రోలింగ్ లను తీవ్రంగా పరిగణిస్తాం: జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్.

 *అనకాపల్లి జిల్లా పోలీసు* 

*పత్రికా ప్రకటన* 

 

ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియా నందు తప్పుడు ప్రచారాలను మరియు ట్రోలింగ్ లను తీవ్రంగా పరిగణిస్తాం: జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్.

అనకాపల్లి, మార్చి 21:* సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆన్ లైన్ వేధింపులు, సోషల్ మీడియా ట్రోలింగ్లు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తల ప్రచారాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని, అట్టి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించిన జిల్లా ఎస్పీ 


ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వాట్సప్, టెలిగ్రాం మరియు ఫేస్ బుక్ గ్రూపుల్లో అడ్మిన్ యొక్క బాధ్యతలు"


▪️వాట్సప్, టెలిగ్రాం మరియు ఫేస్ బుక్ వంటి గ్రూప్ లో ప్రతి పోస్టుకి బాధ్యత తీసుకోవాలి.

▪️ గ్రూప్ లో యాడ్ చేసే ప్రతి సభ్యుడు తప్పకుండా అడ్మిన్ కి తెలిసి ఉండాలి.

▪️అభ్యంతకర, తప్పుడు వార్త, వదంతులు పై స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలి.

▪️ఎవరైనా సభ్యులు అభ్యంతకరంగా ప్రవర్తిస్తే వెంటనే గ్రూప్నుంచి తొలగించాలి.

▪️ఆ వివాదస్పద పోస్టింగ్ సంబంధించి ఆడ్మిన్ ఏంచర్యలు తీసుకోకుంటే అతడిపై పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

▪️ వివాదస్పద పోస్టు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి.


*షేర్ చేయకూడని విషయాలు ...* 


▪️విద్వేషాలు రెచ్చగొట్టేవి

▪️తప్పుడు సమాచారం

▪️తెలియని సమాచారం

▪️ వర్గపోరు కు దారి తీసేవి

▪️మార్ఫింగ్ చేసిన ఫోటోలు

▪️తప్పుదారి పట్టించే సమాచారం.


ఎన్నికల నియమావళి కూడా అమలులో ఉన్నందువలన ఆన్ లైన్ వేధింపులు, సోషల్ మీడియా ట్రోలింగ్లు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తల ప్రచారాలకు పాల్పడడం ద్వారా చట్ట వ్యతిరేకమైన పనులలో భాగస్వామం అయిన యెడల చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోనుబడతాయి. 


*సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అయ్యే ఫేక్ న్యూస్ ను గుర్తించే మార్గాలు/విధానాలు :* 1.సమాచారాన్ని ధృవీకరించండి: ఏదైనా వార్త లేదా సమాచారాన్ని పంచుకునే ముందు, విశ్వసనీయ మూలాల నుండి దాని ప్రామాణికతను ధృవీకరించండి.


2.ఫాక్ట్ చెక్ ( క్రాస్-చెక్) : దాని ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి బహుళ మూలాల నుండి ఒకే వార్తలను తనిఖీ చేయండి.

👉

https://factcheck.pib.gov.in/- To check and report the fake news

👉@PIB_India- On Twitter

👉 https://www.facebook.com/pibindia/?ref=embed_page- Facebook

👉 https://www.kooapp.com/profile/PIBFactCheck


3.ఇతరులకు అవగాహన కల్పించండి: సమాచారాన్ని పంచుకునే ముందు దాన్ని ధృవీకరించడం యొక్క ప్రాముఖ్యత గురించి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు తెలియజేయండి.


4.నకిలీ వార్తలను నివేదించండి: నకిలీ వార్తలను మీరు కనుగొన్న ప్లాట్‌ఫారమ్ లేదా సోషల్ మీడియా సైట్‌కు నివేదించండి.


5.వాస్తవ తనిఖీ సైట్‌లను ఉపయోగించండి: వార్తలను భాగస్వామ్యం చేయడానికి ముందు వాటి ప్రామాణికతను ధృవీకరించడానికి వాస్తవ తనిఖీ వెబ్‌సైట్‌లను ఉపయోగించండి.


6.క్లిక్‌బైట్ హెడ్‌లైన్‌లను నివారించండి: సంచలనాత్మకంగా అనిపించే లేదా నిజం కావడానికి చాలా మంచి హెడ్‌లైన్‌లను క్లిక్ చేయడం లేదా షేర్ చేయడం మానుకోండి.


7.ఫార్వార్డ్ చేసిన సందేశాలతో జాగ్రత్తగా ఉండండి: మీకు ఫార్వార్డ్ చేయబడిన సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండండి, ప్రత్యేకించి అవి అనుమానాస్పదంగా అనిపిస్తే.


8.క్రిటికల్ థింకింగ్ ఉపయోగించండి: వార్తా మూలాలు మరియు కథనాల విశ్వసనీయతను అంచనా వేయడానికి విమర్శనాత్మక ఆలోచనను ఉపయోగించండి.


9.బాధ్యతాయుతమైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించండి: సమాచారాన్ని పంచుకునే ముందు దాన్ని ధృవీకరించమని ఇతరులను ప్రోత్సహించండి.


👉ఏదైనా సమాచారాన్ని పోలీసు వారికి తెలియజేయడానికి పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది.

*పోలీస్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 9440904229.* (సమాచార అందించిన వారి వివరాలు గోప్యముగా ఉంచడం జరుగుతుంది.)


అనకాపల్లి జిల్లా పోలీసు వారిని సోషల్ మీడియా సామాజిక మాధ్యమాలలో సంప్రదించడానికి 

*Twitter :-* https://twitter.com/AKPPolice/ 

*Facebook:-* https://www.facebook.com/anakapallidistrictpolice/

*Instagram:-* https://www.instagram.com/anakapallidistrictpolice/ 

*WhatsApp Channel:-* 

https://whatsapp.com/channel/0029VaPd1DQFsn0mOsuj2V1b అనుసరిచండి.


రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అనకాపల్లి జిల్లా పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ గారు విజ్ఞప్తి చేశారు.


*జిల్లా పోలీస్ కార్యాలయం,* *అనకాపల్లి.*