గొలుగొండ రిపోర్టర్ మాణిక్యం
*రద్దు చేసిన భూములను దళితులకు అప్పగించాలి*
కలెక్టర్ గారిచే దర్యాప్తు చేసి మాకు న్యాయం చేయాలి
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం జోగంపేట గ్రామం తాండవ భూ నిర్వాసితు బాధితులకు 1989లో కోటవరట్ల మండలం పొందూరు ( బందలో) 51 కుటుంబాలకు 102 ఎకరాల డిఫారం పట్టా మంజూరు చేశారు పందూరు గ్రామం నుండి సుమారు 15 కిలోమీటర్లు నడిచి వెళ్లి ఒక్కొక్కరికి రెండు ఎకరంలో చొప్పున అడవి నరికి మూడు సంవత్సరాలు ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నిత్యవసర సరుకులు బియ్యం పంపిణీ చేసి వారు అడివి మొత్తం నరికి భూమి చదును చేసి జీడిమొక్కలు పెంచి జీవనం సాగిస్తున్నాము
పందూరు బందులో సుమారు నాలుగు ఎకరాలు గ్రామకంఠం ఇచ్చిన భూమి కూడా ఆక్రమణకు గురైంది ఎన్నిసార్లు తెలియజేసిన ఆక్రమణదారుల్ని తొలగించలేదు జీడి తోట పెంచి పిక్కల వేరుకునే సమయానికి పిక్కలు వేరుకునే వాళ్ళము కానీ స్థానిక భూస్వాములు 102 ఎకరాముల మీద కన్ను పడింది ఆర్డీవో కి తప్పుడు సమాచారం అందించి 2018 వ సంవత్సరంలో నర్సీపట్నం ఆర్డిఓ కే సూర్యరావు జోగంపేట నుంచి వచ్చి తాండవ నిర్వాసితులు భూముల్లో లేరని ఆర్డీవో సూర్యరావు ఆ భూమిని క్యాన్సల్ చేసి ఉన్నారు అప్పటినుంచి సుమారు ఐదు సంవత్సరం నుండి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కార్యాలయముకు స్పందనకి తిరుగుతున్నాము కొత్తగా విభజించిన అనకాపల్లి జిల్లా కలెక్టర్ వారి కార్యాలను కూడా స్పందనకి ఫిర్యాదు చేశాం కానీ ఇప్పటివరకు ఏ అధికారులు కూడా స్పందించకపోవడం వల్ల గత మూడు వారాల నుంచి అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంకు తిరుగుచున్న జోగంపేట దళితులను ఎవరూ కూడా న్యాయం లేదు ఇప్పటివరకు ప్రభుత్వం వారు
ప్రవేశపెట్టిన వ్యవసాయ పెట్టుబడి సాయం రైతు భరోసా క్రాఫ్ లోనూ పట్టా పాస్ బుక్కు వివిధ బ్యాంకుల్లో పెట్టి బ్యాంకు రుణం కూడా తీసుకున్నాము ప్రస్తుతం ప్రతి ఒక్కరికి వన్ బి అడంగలు ఎమ్మార్ భరోసా క్రాఫ్ లోనూ పట్టా పాస్ బుక్కు వివిధ బ్యాంకుల్లో పెట్టి బ్యాంకు రుణం కూడా తీసుకున్నాము ఎమ్మార్వో డిజిటల్ సిగ్నేచర్ తో ప్రతి పట్టాదారుడికి ఉంది ఇన్ని ఆధారాలు ఉండి కూడా ఆర్డిఓ ఏ కారణం చేత రద్దు చేశారో తెలియదని దళితులైన నిరుపేద కుటుంబాలు ఆవేదన చెందుతున్నారు ఈ కార్యక్రమం కు జువ్వల వరహాల బాబు ఉడతపల్లి గంగరాజు కులి గడ్డయ్య పులి ధారబాబు లెక్కల రాజబాబు జువ్వల నారాయణ అనేక దళిత కుటుంబాలు పాల్గొన్నారు