అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 30 పోలీసు యాక్ట్ అమలు జిల్లా ఎస్పీ కె.వి మురళీకృష్ణ

 అనకాపల్లి జిల్లా పోలీసు

    గొలుగొండ  రిపోర్టర్ టీ  మాణిక్యం 

 అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో వున్నందున జిల్లాలో ఎక్కడా ఎటువంటి  నిరసనలకు, ధర్నాలకు, బంద్ కు అనుమతించలేదని అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్.,  పత్రిక ప్రకటన జారీ చేశారు.

అనకాపల్లి, సెప్టెంబర్ 11: ఈరోజు టిడిపి పార్టీ రాష్ట్ర బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో నిరసనలకు, ధర్నాలకు ఎటువంటి  అనుమతి లేదన్నారు.

బస్సులు, రైళ్లు  తిరిగేందుకు ఆటంకాలు కలిగించినా,

పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సముదాయాలను బలవంతంగా మూయించినా  వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల సాధారణ జన జీవనం, రాకపోకలకు బలవంతంగా ఎలాంటి అసౌకర్యం కలిగించినా చట్టపరమైన  చర్యలు తప్పవని హెచ్చరించారు.  

నిబంధనలు ఉల్లంఘించి రోడ్ల పైకి వచ్చి అల్లర్లు చేసినా , ప్రభుత్వ ఆస్తుల కు నష్టం కలిగించాలని చూసినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ  గారు హెచ్చరించారు.

 జిల్లా పోలీసు కార్యాలయము,అనకాపల్లి.