కత్తులతో బెదిరించిమైనర్ బాలిక పై గ్యాంగ్‌రేప్

హైదరాబాద్‌లో దారుణం.. మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్‌ గ్యాంగ్‌రేప్.. కత్తులతో బెదిరించి దారుణానికి పాల్పడ్డ గంజాయి బ్లెడ్ బ్యాచ్



మహిళల కోసం ఎన్నో చట్టాలు..వాటన్నిటినీ కూడా లెక్క చేయకుండా సమాజంలో కుక్కలకన్న హీనం గా ప్రవర్తిస్తూ ఉన్నారు..కొందరు కామాత్ములు...ఇలాంటి వారికి ఎంకౌంటర్నే గతి అని బాధిత మహిళలు కోరుతున్నారు....


ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. మహిళలు, బాలికలపై ఆత్యాచారయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. 


నిర్భయ, పోక్సో లాంటి కఠిన చట్టాలను తీసుకువచ్చినా నిందితులు.. ఎలాంటి భయం బెదురు లేకుండా దారుణ ఘటనలకు పాల్పడుతూనే ఉన్నారు.

ఈ మధ్యకాలంలో బాలికలపై అత్యాచార యత్నాలు పెరిగాయంటూ రిపోర్టులు చెబుతున్నాయి. 


మతిస్థిమితం లేని బాలికపై అత్యాచార ఘటన మరవకముందే మరొక ఘటన హైదరాబాద్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. 


ఈ వరుస ఘటనలతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

16 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ..హైదరాబాద్ లాల్ బజార్ కు చెందిన బాలిక తల్లిదండ్రులు గతంలో చనిపోవడంతో 15 రోజుల నుంచి ఆమె సోదరుడితో కలిసి మీర్పేట్ లోని ఓ కాలనీకి వచ్చి సమీప బంధువైన అక్క దగ్గర ఆశ్రయం పొందుతున్నారు. అయితే, బాలిక దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుంది. తమ్ముడు ఫ్లెక్సీలు కట్టే పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం 9 గంటలకు బాలిక తన సోదరుడు మరో ముగ్గురు చిన్నారులతో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో.. ఎనిమిది మంది నిందితులు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డారు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న ఆ బృందంలోని నలుగురు బాలిక మెడపై కత్తి పెట్టారు. అనంతరం భవనంలోని మూడో అంతస్తులోకి తీసుకెళ్లగా.. మిగిలిన వారు ఆమె తమ్ముడితో పాటు అక్కడే ఉన్న చిన్నారిని బెదిరించారు. నిందితుల్లో ముగ్గురు బాలికను కత్తితో బెదిరిస్తూ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు.

తరువాత బాలిక గట్టిగా కేకలు వేయడంతో పరారైనట్లు బాలిక బంధువులు తెలిపారు. విషయం తెలుసుకున్న బాధితురాలి సోదరి మీర్‌పేట పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం సఖి కేంద్రానికి తరలించారు. అయితే ఈ కేసులో బాలిక నివాసం ఉండే భవనంలో.. కింది అంతస్తులో ఉండే టైసన్, మంగళహాట్‌కు చెందిన రౌడీ షీటర్ నిందితులో ఉన్నట్లు బాధితురాలు సోదరుడు చెబుతున్నాడు. మరో ఇద్దరు నిందితులు తమ నివాసానికి సమీపంలో ఉంటారని పోలీసులకు వివరించాడు. అయితే ఈ కేసులో నలుగురిని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.