15,16వ లో మృతి చెందిన ఆర్.సందీప్,పీరమ్మ మృతదేహాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి అంబటి

 



పట్టణంలోని 16 వ వార్దుకు చెందిన రావెల సెలీనా కుమారుడు సందీప్ ఆకస్మికంగా మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు రావెల స్వగృహంలో సందీప్ మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

15 వ వార్డుకు చెందిన బొడ్డు ప్రభుదాసు భార్య పీరమ్మ మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని సందర్శించి మంత్రి అంబటి పూలమాలవేసి నివాళులర్పించారు.

 అంబటితో పాటు 16వ వార్డు ఇన్చార్జి నందిగామ ఆదాం,  వార్డు నాయకులు చిలక రమణయ్య, పల్నాడు జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు అచ్యుత శివప్రసాద్, స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.