సీతారామం సినిమాతో ఒక్కసారిగా దేశమంతా పాపులర్ అయింది మృణాల్ ఠాకూర్. ఈ సినిమాతో మృణాల్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ సినిమాలో ఎంతో పద్దతిగల అమ్మాయిలా నటించి అందర్నీ మెప్పించింది. ఇక ఆ సినిమా తర్వాత తన బోల్డ్ ఫోటోషూట్స్ తో మరింత పాపులర్ అయి ఫాలోయింగ్ పెంచుకుంది మృణాల్.ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ చాలా బిజీగా ఉంది. ఓ పక్క క్యూట్ క్యారెక్టర్స్ చేస్తూనే మరోపక్క బాలీవుడ్ లో బోల్డ్ క్యారెక్టర్స్ కి ఓకే చెప్తుండటంతో టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన మృణాల్ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దీంతో ప్రస్తుతం మృణాల్ భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.
ఒకప్పుడు ఛాన్సుల కోసం కష్టపడిన మృణాల్ ఒక్క సీతారామం సినిమాతో స్టార్ అయిపోయి ఇప్పుడు మరింత దూసుకుపోతూ ఇలా కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటుండటంతో పలువురు అభినందిస్తున్నారు. కొంతమంది మాత్రం అమ్మో అంత రెమ్యునరేషనా? సినిమా హిట్ అవ్వగానే పెంచేసింది అని కామెంట్స్ చేస్తున్నారు.