ర్యాలీగా తరలివచ్చి బస్టాండ్ సెంటర్లో ధర్నా నిర్వహించిన వాలంటీర్లు.
ఖబడ్దార్ కళ్యాణ్- క్షమాపణ చెప్పకపోతే సహించేది లేదు
సత్తెనపల్లి : ఆంధ్రప్రదేశ్ వాలంటరీ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై వాలంటీర్లు బగ్గుమన్నారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ ఆరోపణలు ఖండిస్తున్నామని ముక్తకంఠంతో ప్రకటించారు జనసేన నేత వాలంటీర్ వ్యవస్థకు క్షమాపణ చెప్పకపోతే సహించేది లేదంటూ హెచ్చరించారు సోమవారం పట్టణంలో వెంకటేశ్వర గ్రాండ్ రెసిడెన్సి నందు ఏలూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థ పై చేసిన ఆరోపణలకు నిరసనగా వాలంటీర్లు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా
20వ వార్డు వాలంటీర్ ఫణిదరపు అశోక్ మాట్లాడుతూ "పవన్ కళ్యాణ్ నాకు కొంచెం తిక్కుంది అని" అప్పుడప్పుడు మాట్లాడుతుంటారని ఆ తిక్క నిన్న ఏలూరులో నిరూపితమైందని, అది సరిచేసుకోకపోతే రోడ్లపై తిరగనివ్వమన్నారు. సేవా సైన్యంపై ఆరోపణ చేస్తే సహించేది లేదన్నారు.
కొత్తపేట సచివాలయం పరిధిలోని వాలంటీర్ పొందుగల లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ కరోనా సమయములో బంధువులు సైతం కరోనా బాధితులని వదిలేసి వెళ్తే ప్రాణాలకు తెగించి వారికి సేవలు అందించామని నేను పవన్ కళ్యాణ్ సామాజిక వర్గమే ఆయన నిజాయితీగా పనిచేస్తున్న మా వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నానన్నారు.
23 వ వార్డు వాలంటీర్ కస్తల అశోక్ కుమార్ మాట్లాడుతూ ఓ పనికిమాలిన వాడు స్క్రిప్ట్ రాసిస్తే ఈ తిక్కలోడు ఏది పడితే అది మాట్లాడుతున్నారని, ఖబర్దార్ పవన్ కళ్యాణ్ తక్షణం వాలంటీర్ల వ్యవస్థకు క్షమాపణ చెప్పకపోతే నిన్ను రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని ప్రకటించారు.
వాలంటీర్ నల్లగట్ల ఆదిలక్ష్మి మాట్లాడుతూ కేవలం రూ 5 వేల గౌరవ వేతనం తీసుకుంటూ పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నామన్నారు. వాలంటీర్ల పై చులకనగా మాట్లాడితే జాగ్రత్త పవన్ కళ్యాణ్ వారాహిని వీధుల్లోకి రానివ్వమని హెచ్చరించారు. బశరతుగా వాలంటర్లకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
ముందుగా వెంకటేశ్వర రెసిడెన్సులో జరిగిన సమావేశంలో పలువురు వాలంటీర్లు మాట్లాడి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఖండించారు. ఉమెన్ ట్రాఫికింగ్ కు, వాలంటీర్లకు ఎలాంటి సంబంధం లేదని, ఈ ప్రభుత్వం మహిళా పక్షపాతి అని అనేక పథకాలు మహిళలకు అందిస్తున్నామని వారు వివరించారు. నీ పార్టీలో ఉన్న మహిళల ఫోన్ లో కూడా దిశా యాప్ ఉంటుందని మహిళల అక్రమ తరలింపు నిరసనగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వాలంటీర్లుగా మేము వారిని చైతన్యం చేస్తున్న వారు వివరించారు. అనంతరం ర్యాలీగా బస్టాండ్ వరకు వచ్చి ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పట్టణం, సత్తెనపల్లి రూరల్ కు చెందిన వాలంటీర్లు, మున్సిపల్ నాయకులు, కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు, పట్టణ, రూరల్ వైఎస్ఆర్సిపి కన్వీనర్లు, తదితరులు పాల్గొన్నారు.