బ్యాంకులకు 6 రోజులు సెలవులు



 బ్యాంకులకు సెలవులు  అందువల్ల మీరు బ్యాంక్ హాలిడేస్ తెలుసుకుంటే.. అందుకు అనుగుణంగా బ్యాంకింగ్ పనులను చక్కబెట్టుకోవచ్చు.లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బ్యాంక్‌ బ్రాంచ్‌కు వెళ్లి మళ్లీ వెనక్కి రావాల్సి రావొచ్చు. అందుకే మీరు ఈ విషయం గుర్తించుకోవాలి. బ్యాంక్ హాలిడేస్ ఎప్పుడెప్పుడు ఉన్నాయో చెక్ చేసుకోవడం ఉత్తమం.దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంక్ హాలిడేస్ క్యాలెండర్ రూపొందించింది. దీని ప్రకారం బ్యాంకులు హాలిడే ఉంటుంది. ప్రాంతం ప్రాతిపదికన ఈ బ్యాంక్ హాలిడేస్ మారుతూ ఉంటాయి.ఆర్‌బీఐ బ్యాంక్ హాలిడేస్ క్యాలెండర్ ప్రకారం చూస్తే.. దేశవ్యాప్తంగా బ్యాంకులు పది రోజుల్లో ఏకంగా ఆరు రోజులు సెలవులు ఉన్నాయి. ఈ హాలిడేస్ రాష్ట్రం ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. ఏ ఏ ప్రాంతాల్లో బ్యాంక్ హాలిడేస్ ఉన్నాయో మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

జూలై 8న రెండో శనివారం వచ్చింది. అందువల్ల ఈ రోజు బ్యాంకులు పని చేయవు. అలాగే జూలై 9న ఆదివారం. అందువల్ల రేపు కూడా బ్యాంకులు క్లోజ్ లోనే ఉంటాయి. అంటే నేడు, రేపు బ్యాంకులు పని చేయవు.అలాగే జూలై 11న కేర్ పూజ సందర్భంగా బ్యాంకులు సెలవు ఉంది. అయితే ఈ బ్యాంక్ హాలిడే కేవలం అగర్తలాలో మాత్రమే ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో బ్యాంకులు తెరిచే ఉంటాయి.జూలై 13న కూడా బ్యాంక్ హాలిడే ఉంది. భాను జయంతి సందర్భంగా బ్యాంక్ సెలవు ఉంటుంది. కేవలం గ్యాంగ్‌టక్‌లో బ్యాంక్ హాలిడే ఉంది. ఈ రోజు కూడా బ్యాంక్ సెవలు ఉంది.అలాగే జూలై 16న కూడా బ్యాంక్ పని చేయదు. ఆదివారం వచ్చింది. అందువల్ల బ్యాంక్ హాలిడే ఉంటుంది. ఇక జూలై 17న కూడా భ్యాంక్ సెలవు ఉంది. ఆ రోజున యూ టిరోట్ సింగ్ డే వచ్చింది. అందువల్ల బ్యాంక్ హాలిడే ఉంది. షిల్లాంగ్‌లో బ్యాంకులు పని చేయవు.కాగా బ్యాంక్ హాలిడేస్ ఉన్నా కూడా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ వంటి సర్వీసులు లభిస్తాయి. అందువల్ల బ్యాంక్ కస్టమర్లకు వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. అయితే కచ్చితంగా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాలంటే మాత్రం బ్యాంక్ హాలిడేస్ చెక్ చేసుకోండి. సులభంగానే బ్యాంకింగ్ పనులు పూర్తి చేసుకోవచ్చు.