హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి తన తండ్రి పేరు పెట్టుకోవడాన్ని సమర్థిస్తూ జగన్ అసెంబ్లీలో చెప్పిన మాటలపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఏపీలో వైద్య విద్యలో సమూల మార్పులు చేసింది కాలేజీలు పెంచింది తన తండ్రి వైఎస్సార్ తాను మాత్రమేనని జగన్ చెప్పుకొచ్చారు. అందుకే యూనివర్సిటీకి తన తండ్రి పేరు పెట్టాలని నిర్ణయించడంలో తప్పేమీ ఉందన్నారు.దీనిపైన తీవ్ర విమర్శలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడు జగన్ ప్రభుత్వం నిర్మిస్తోంది మూడు కళాశాలలనే. వాటిలో కూడా పులివెందుల కాలేజీ మాత్రమే నిర్మాణంలో ఉంది. మిగిలినవాటికి కనీసం శంకుస్థాపనలు కూడా పూర్తి కాలేదు. 1983 నుంచి ఇప్పటిదాకా టీడీపీ హాయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా నిర్మితం కాలేదని యథేచ్ఛగా అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు ఆడేశారని అంటున్నారు.