బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం


బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది.
ఒడిషా, వెస్ట్ బెంగాల్ తీరాలకు ఆనుకొని అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. మరో 24 గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉంది. సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది.

అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలుచోట్ల వర్షాలు,ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురీసే ఛాన్స్ ఉంది.తీరాల్లో బలమైన గాలులు వీచనుండటంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది.