కాపు‘నేస్తం’ అంటూనే సమస్తం హుళక్కి!


జగన్‌ ప్రభుత్వం రాగానే ఒక పధకం ప్రకారం కాపు కార్పొరేషన్‌ను
నిర్వీర్యం చేశారు. గత ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌కింద ఇచ్చిన 5శాతం రిజర్వేషన్లు ఎత్తేశారు. కాపు విద్యార్థుల విదేశీవిద్యకు మంగళం పాడారు. స్వయం ఉపాధి పథకం రద్దు చేశారు. ఏతావాతా కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజికవర్గాల ప్రజలకు ఒక్క పథకమే మిగిల్చారు. అదే కాపు నేస్తం. శుక్రవారం ఈ పథకానికే సీఎం జగన్‌ ఆర్భాటంగా బటన్‌నొక్కి నగదు విడుదల చేయబోతున్నారు. 

ఇది తప్ప కాపుల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తోన్న మరో పథకం ఏదైనా ఉందా అని దుర్భిణీ వేసి వెతికినా కనిపించదు. ఎందుకంటే రూ.2వేల కోట్లతో పథకాలు అమలుచేయాల్సిన కాపు కార్పొరేషన్‌ పనేం లేక ఈగలు తోలుకుంటోంది. కాపు నేస్తం’ మినహా, మిగిలినవన్నీ జగన్‌ ప్రభుత్వం రద్దు చేసేసింది. సగటున ఏడాదికి రూ.700 కోట్లు కాపు కార్పొరేషన్‌కు ఖర్చు చేసింది. ప్రధానంగా స్వయం ఉపాధి పథకానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చి ఏటా రూ.300 కోట్లు ఖర్చుచేశారు. కాపులకు విద్యోన్నతి, విదేశీ విద్య పథకాలు అమలుచేశారు. కాపు భవనాల నిర్మాణం ప్రారంభించారు.

కాపులకు విద్యోన్నతి, విదేశీ విద్య పథకాలు అమలుచేశారు. కాపు భవనాల నిర్మాణం ప్రారంభించారు. పోటీపరీక్షలకు ఉచిత కోచింగ్‌, మహిళలకు వివిధ రంగాల్లో ఉపాధి శిక్షణ అమలుచేశారు. వైసీపీ వచ్చాక అవన్నీ ఆవిరయ్యాయి. స్వయం ఉపాధిపై పెట్టుకున్న కాపు యువత, మహిళల ఆశలు గత మూడేళ్లలో మృగ్యమయ్యాయి. ఒక్కరంటే ఒక్కరు కూడా స్వయం ఉపాధి యూనిట్‌ పెట్టుకోలేకపోయారు. కాపునేస్తం కింద ఇచ్చే రూ.15వేలు ఎందుకూ సరిపోక, స్వయంఉపాధి పథకం లేక కాపు సంక్షేమం నిర్వీర్యమైంది.కాపు సంక్షేమం కోసం ఏటా కార్పొరేషన్‌కు రూ.2వేల కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ లెక్కన ఐదేళ్లలో రూ.10వేల కోట్లు ఇస్తారు అని కాపులు ఆశించారు. కానీ తీరా అధికారంలోకి వచ్చాకగానీ ఆ వేలకోట్ల లెక్కల గారడీ బయటపడలేదు. 45 నుంచి 60ఏళ్ల మధ్య వయసున్న కాపు మహిళలకు రూ.15వేలు ఇచ్చే ‘కాపు నేస్తం’ మినహా, మిగిలినవన్నీ జగన్‌ ప్రభుత్వం రద్దు చేసేసింది. గత ప్రభుత్వంలో చేతల్లో కనిపించిన కాపు సంక్షేమాన్ని కాగితాలకే పరిమితం చేసింది.