శ్రీలంక నుంచి పాఠాలు నేర్చుకోవాలి’ అని గంభీరమైన ఉపన్యాసాలు చేస్తోంది. లోలోపల మాత్రం జగన్ సర్కారు చేస్తున్న అప్పులకు సహకరిస్తూ.. రాష్ట్రాన్ని నిండా ముంచుతోంది. ‘మోదీ-జగన్’ మధ్య బంధానికి ఇదొక నిదర్శనమని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పుల వివరాలు చెప్పాలంటూ అటు కేంద్రం, ఇటు ఏజీ కార్యాలయం రాష్ర్టానికి లేఖలు రాస్తున్నాయి. రాష్ట్రం మాత్రం స్పందించడం లేదు. తప్పనిసరి స్పందించాల్సి వస్తే.. తప్పుడు లెక్కలే పంపుతోంది. అసలు.. చేసిన తప్పులను రాష్ట్రం ఒప్పుకుంటుందని కేంద్రం ఎలా భావిస్తోందో అర్థం కావడంలేదు.
కేంద్రం, కాగ్ అప్పుల వివరాలు తీసుకునేందుకు రాష్ట్రం మీద ఆధారపడడం అనుమానాలకు తావిస్తోంది. కార్పొరేషన్లకు తప్పుడు మార్గాల్లో ఇస్తున్నది ప్రభుత్వ రంగ బ్యాంకులే. ఈ బ్యాంకులకు యజమాని కేంద్రం ఆర్థిక శాఖ. ప్రైవేటు బ్యాంకులు, పీఎ్‌ఫసీ, ఆర్‌ఈసీ వంటి ఆర్థిక సంస్థలపైనా కేంద్రానిదే ఆజమాయిషీ! రాష్ట్రం ఇచ్చే లెక్కలే నిజమని ‘నమ్మి’ నివేదికలు తయారు చేస్తున్నాయి. ఈ అరకొర లెక్కలతో నివేదికలు తయారుచేస్తేనే అప్పుల్లో ఏపీ రెండు మూడు స్థానాల్లో ఉంది. పూర్తి వాస్తవాలు బయట పడితే. మరే రాష్ర్టానికి అందనంత ఎత్తులో ఉంటుంది.ఏపీఎ్‌సడీసీ అక్రమ అప్పుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది కాబట్టి ఆ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన రూ.23,200 కోట్లను వచ్చే నాలుగేళ్ల అప్పుల పరిమితిలో మినహాయిస్తామని కేంద్రం చెప్పుకొచ్చింది.
మరి బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన ఇంకో దొంగ అప్పు రూ. 8,300 కోట్లను ఏం చేస్తారు? ఏపీఎ్‌సడీసీకి మించిన తీవ్రమైన నేరమిది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 266(1), 266(3)ని నేరుగా ఉల్లంఘించి బేవరేజెస్ కార్పొరేషన్‌కు ఆదాయాన్ని మళ్లించారు. దీనికోసం ఇష్టారాజ్యంగా చట్టాలు చేశారు. అయినా.. కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.