చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండల కేంద్రంలో R&B రహదారి పై పెద్ద పెద్ద గుంతలు పడి అనేకమంది వాహనదారులు ప్రమాదములు గురగుతున్నా వాటికి మరమ్మతులు చెయ్యకపోవడంపై స్పందించి జనసేన పార్టీ తరపున ఇంచార్జి PVSN రాజు ఆధ్వర్యంలో ఈ రోజు WBM మెటీరియల్ తో గుంతలు పూర్తి స్థాయిలో ఎక్కువ కాలం ఉండేటట్లు పూడ్చి రహదారిని బాగుచెయ్యడమయినది. ఈ సందర్భంగా ఇంచార్జి
PVSN రాజు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రహదారులు పరిస్థితి దారుణం
గా ఉందని నియోజకవర్గంలో పరిస్థితి అత్యంత అధ్వాన్నం గా ఉందని రోజూ అనేకమంది ప్రమాదాలకు గురగుతున్నా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం గా ఉండడం దుర్మార్గము వారు ఇలాగే ప్రజలపట్ల వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లిచుకొంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమములో మండల పార్టీ అధ్యక్షులు బలిజ మహారాజు నాయకులు పరవాడ దొరబాబు , బంటు నాయుడు బాబు ,ఈటంశెట్టి జగ్గునాయుడు , ఆర్పి త్రినాధ్ , చింతల కిషోర్ , దాసరి చిన్నబ్బాయి , కోన రమణ , జనసైనికులు పాల్గొన్నారు.