కడప నగరంలో ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా కోర్టు సెలవు దినాల్లో కాలువ వెడల్పు పేరుతో అక్రమ కూల్చివేతలను జనసేన ఖండిస్తూ... బాధిత కుటుంబాలను పరామర్శించి, వారితో పాటు నిరసన కార్యక్రమoలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర కార్యదర్శి శ్రీ తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, పట్టాలు ఉన్న వాటిని అదికూడా రెహాబిటేషన్ చూపకుండా పాడగొడతానానడం అధికారులు విడ్డురం..
దీని బదులు అధికారులు వైసీపీ చొక్కాలు వేసుకోవడం మేలని ఏద్దేవా చేశారు.... దాదాపు ముప్పై నలభై సంవత్సరాలనుండి ఇంటిపన్ను, నీటిపన్ను, కరెంట్ బిల్లులు కడుతున్న వీళ్లకు న్యాయం చెయ్యడంలో జిల్లాలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, ఎంపీ విఫలం అయ్యారని విమర్శించారు. ఇంత యుద్ధ ప్రాతిపదికన ఎవరి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, పాకేజికి, ఈ ప్రభుత్వం పని చేస్తున్నారని నీలాదీశారు. మీకు జనసేన పార్టీ, జిల్లా జనసేన యంత్రాంగం మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మరొక రాష్ట్ర కార్యదర్శి ముఖరం చాన్ గారు మాట్లాడుతూ అసలు ఇంత అన్యాయం జరుగుతుంటే ఉప మాఖ్యమంత్రి అంజద్ భాష ఏమిచే స్తున్నారని, ఇది అందరికి తెలిసే జరుగుతున్న నాటకమని విమర్శంచారు. ఓటు వేపించుకుని మోసం చీసిన వైసీపీ నాయకులకు ఈసారి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు మాలే శివ,ఇందిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, పండ్రా రంజిత్ కుమార్, పత్తి విస్సు, షైక్ సలీం, గజ్జల సాయి, గౌస్ భాష, షరీఫ్, రాఘవ,, సన్నీ తదితరులు పాల్గొన్నారు.