తవ్వకాల్లో బయటపడ్డ,,భూమిలోపల భారీ కోట:


అరుణాచల్ ప్రదేశ్‌లోని పాపమ్ పారే జిల్లాలోని తారాసో ప్రాంతంలోని రా
మ్‌ఘాట్ అడవులలో 20 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో కోట ఆనవాళ్లు కనుగొనబడ్డాయి. అనంతరం జరిపిన పూర్తి పాక్షిక తవ్వకాల్లో 13వ శతాబ్దపు కోట బయటపడింది. భూమికింద 226 మీటర్ల పొడవుతో భారీ కోటను నిర్మించడం విశేషం. పురావస్తుశాఖ అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం, ఈ కోట లేదా గోడలో ఒక ద్వారం ఉండాలి. అడవి మధ్యలో నిర్మించిన ఈ కోట వ్యూహాత్మక పరిశీలనలో ప్రధాన భాగంగా నిర్మించారు. కోట నిర్మాణంలో ఉన్న రాళ్లపై బాణాలు, త్రిశూల గుర్తులు ఉన్నాయని పురావస్తు శాస్త్రవేత్త పురా కోజి తెలిపారు.కోట లోపల విరిగిన శివలింగం కూడా కనిపించింది. 

తారాసో ప్రాంతంలోని వ్యాస్ కుండ్ చుట్టూ జరిపిన పురావస్తు పరిశోధనల్లో రాతి మెట్ల అవశేషాలు కనుగొనబడ్డాయి. కోటల నిర్మాణంలో రాతి దిమ్మెలు, కాలిన ఇటుకలు మరియు రాతి బండరాళ్లు ఉపయోగించబడ్డాయి. రాతి దిమ్మెలతో చేసిన ద్వారం దీర్ఘచతురస్రాకారంలో మరియు అర్ధగోళాకారంలో కనిపించింది. కొన్ని రాతి దిమ్మెలపై బాణాలు, త్రిశూలాలను పోలి ఉండే చిహ్నాలను వారు గుర్తించారు.గతంలో ఈ ప్రాంతం చాలా జనసాంద్రత కలిగి, బలమైన రాజు ఎవరైనా ఈ ప్రాంతాన్ని పాలించి ఉంటారని భావిస్తున్నారు. గతంలోనూ బలిజన్‌లో పురాతన కాలం నాటి అవశేషాలు కనుగొనబడ్డాయి. క్రీస్తు పూర్వం నాటి పాత్రలు, వేటకు వినియోగించిన ఆయుధాలు కూడా కనుగొనబడ్డాయి