కారులోరూ.3 కోట్లు ..ఎవరివి ,,ఎక్కడకి వెళుతున్నాయి


అనకాపల్లి జిల్లాలో కారులో తరలిస్తున్న రూ. 3 కోట్ల రూపాయలను
పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు నక్కపల్లి మండలం,వేంపాడు టోల్ ప్లాజా వద్ద  వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ నగదు పట్టు బడింది.

విశాఖ నుంచి అమలాపురానికి కారులో డబ్బు తరలిస్తున్నారని సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. నగదుతో పాటు నగదు తరలిస్తున్న అమలాపురానికి చెందిన బి.శ్రీనివాస రావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి  తీసుకున్నారు. ఈ డబ్బు ఎవరిది ? ఎక్కడికి తీసుకు  వెళుతున్నారనే దాని పై పోలీసులు ఆరా తీస్తున్నారు.పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు నక్కపల్లి మండలం,వేంపాడు టోల్ ప్లాజా వద్ద  వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ నగదు పట్టు బడింది.