సిలిండర్ ధరలపై రూ.200 తగ్గింపు.ఇది కొంద‌రికి మాత్ర‌మే


గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను రూ.200 త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది
. ఇది కొంద‌రికి మాత్ర‌మే అని ష‌ర‌తులు విధించింది. ముఖ్యంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద 9 కోట్ల మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్‌కు (12 సిలిండర్ల వరకు) రూ. 200 సబ్సిడీని అందిస్తామ‌ని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. దేశంలోనే ఎందరో మ‌హిళ‌ల‌కు సాయం చేస్తుంద‌ని ఆమె అన్నారు. 

తాజా తగ్గింపుతో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో రూ.1003గా ఉన్న డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.800కు దిగిరానుంది.పెరుగుతున్న చమురు ధరల మధ్య, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద 9 కోట్ల మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్‌కు రూ. 200 చొప్పున ఎల్‌పిజి ధరలను సబ్సిడీగా అందజేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 12 వరకు ఎల్‌పీజీ సిలిండర్లకు సబ్సిడీ అందించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.